తెలుగు సినిమాలు అంటే ఒకప్పుడు చిన్నచూపు ఉండేది. బాలీవుడ్ హీరోయిన్ లు సైతం తెలుగు సినిమాల్లో నటించాలంటే డిమాండ్లు పెట్టేవారు. కొంతమంది అయితే గొంతెమ్మ కోరికలు కోరేవారు. అంతేకాకుండా వాళ్లు వచ్చి తెలుగు సినిమాల్లో నటిస్తే అదో గొప్పగా మేకర్స్ ప్రమోషన్స్ చేసుకునేవారు. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. ఎక్కడ చూసినా తెలుగు సినిమాల హవా కనిపిస్తోంది. బాలీవుడ్ నటీనటులే ఒక్క ఛాన్స్ అంటూ టాలీవుడ్ వైపు చూస్తున్నారు. దానికి కారణం మన సినిమాలు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకోవడం..ప్రేక్షకుల మనసు దోచుకోవడమే.
ముఖ్యంగా బాహుబలి సినిమాకు ముందు ఆ తరవాత తెలుగు సినిమాలో ఎన్నో మార్పలు వచ్చాయి. బాహుబలి సినిమా ఇండియా మొత్తాన్ని షేక్ చేసింది. ఇక జక్కన్న తీసిన మరో మాస్టర్ పీస్ ఆర్ఆర్ఆర్ పాన్ వరల్డ్ నే షేక్ చేసింది. ఈ సినిమాలోని పాట ఆస్కార్ ను సైతం అందుకుంది. దాంతో ఎక్కడ చూసినా తెలుగు సినిమా గురించే చెప్పుకుంటున్నారు.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం గోవాలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివెల్ ఆఫ్ ఇండియా ఉత్సవాల్లో తెలుగు నటీనటుల కటౌట్ లు దర్శనం ఇవ్వడం గర్వకారణం. దీంతో మెగాస్టార్ చిరంజీవి కల కూడా నెరవేరింది. గతంలో ఓ వేడుకలో చిరంజీవి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. వేరే రాష్ట్రాల్లో సినిమా అవార్డు ఫంక్షన్లకు వెళితే తెలుగువాళ్లకు గుర్తింపు ఉండేది కాదని అన్నారు.
గోవా ఫిల్మ్ ఫెస్టివెల్ కు వెళితే అక్కడ ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఫోటోలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగు సినిమాకు గుర్తింపు రావాలని అన్నారు. ఇక ఇప్పుడు చిరంజీవి కల నెరవేరింది. గోవా ఫిల్మ్ ఫెస్టివెల్ లోనే మన తారల కటౌట్స్ మెరుస్తున్నాయి. అంతే కాకుండా అందులో చిరంజీవి తనయుడు రామ్ చరణ్ సైతం ఉండటం ఆయనకు మరో గర్వకారణం అనే చెప్పాలి.
Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify