NC23: ‘తండేల్’ వీడు ఊర మాస్ గురు

యువ సామ్రాట్ నాగ చైతన్య కస్టడీ ప్లాప్ తర్వాత ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ కొట్టాలనే కసి మీదున్నాడు. అందుకే పెద్దగా గ్యాప్ కూడా తన సినిమాలపై కాన్సెన్ట్రేట్ చేస్తున్నాడు. ప్రస్తుతం కార్తికేయ ఫేమ్ చందు మొండేటి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ గత మూడు నెలలుగా శరవేగంగా జరుగుతుండగా, నాగ చైతన్య కూడా సినిమా షెడ్యూల్స్ కి గ్యాప్ ఇవ్వకుండా రెగ్యులర్ షూటింగ్ లో పాల్గొంటున్నాడు.

అయితే తాజాగా నాగచైతన్య బర్త్ డే సందర్బంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని, ఇంకా టైటిల్ ని రివీల్ చేస్తూ రిలీజ్ చేసారు మేకర్స్. చందు మొండేటి, చై కాంబో లో వస్తున్న ఈ సినిమాకి “తండేల్” అనే టైటిల్ ని నిర్ణయించారు మేకర్స్. అయితే ఈ టైటిల్ కి అర్ధమేంటో మాత్రం చెప్పలేదు. ఇక రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో మాత్రం చై ఊర మాస్ లుక్ లో అదిరిపోయాడని చెప్పొచ్చు.

ఫుల్ గడ్డంతో బనియన్ పై ఒక బోట్ లో ఐరన్ రాడ్ పట్టుకున్న ఉన్న నాగ చైతన్య కెరీర్ బెస్ట్ లుక్ తో ఉన్నాడని చెప్పొచ్చు. ఇంకా ఈ సినిమా స్టోరీ కాన్సెప్ట్ ఏమి రివీల్ చేయకపోగా, రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ లో మాత్రం చై బోట్ లో ఉన్నాడు కాబట్టి, ఆ డ్రెస్సింగ్ స్టైల్ చూసి బహుశా మత్య్స కార్మికుడిగా నటించొచ్చని అనిపిస్తుంది. ఏది ఏమైనా ఈ సినిమా ఫస్ట్ లుక్ తో ఒక్కసారిగా హైప్ పెంచేశారు మేకర్స్. తండేల్ సినిమాతో ఆకలి మీదున్న అక్కినేని ఫ్యాన్స్ కి ఫుల్ మీల్స్ కాకుండా ఏకంగా బిర్యానీ పెట్టేటట్టున్నాడు నాగ చైతన్య. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండగా, రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు