టాలీవుడ్ లో గత కొంత కాలంగా అక్కినేని ఫ్యామిలీ కి గడ్డుకాలం నడుస్తోందన్న సంగతి తెలిసిందే. ఈ ఫ్యామిలీ నుండి ఏడాది కాలంగా వస్తున్న అన్ని సినిమాలు డిజాస్టర్లు గా నిలుస్తున్నాయి. ఒకప్పుడు టాలీవుడ్ ని రూల్ చేసిన హీరోల్లో ఒకరిగా ఉండే నాగార్జున కూడా హిట్టు ఇవ్వలేకపోయాడు. కొన్ని నెలల కిందటొచ్చిన ఏజెంట్, కస్టడీ వరుస బెట్టి ప్లాప్స్ అయ్యాయి. అందుకే అక్కినేని ఫ్యామిలీ పరువు కాపాడాల్సిన బాధ్యత నాగ చైతన్య భుజాలపై పడింది. పైగా స్రిప్ట్ సెలెక్షన్స్ లో కొంచెం బెటర్ సినిమాలు ఎంచుకునేది చై నే కాబట్టి ఫ్యాన్స్ కూడా తనపైనే నమ్మకం పెట్టుకున్నారు.
ఈ నమ్మకం నిజం కావాలనే నాగ చైతన్య చందు మొండేటి తో మంచి కథ తో సినిమా చేస్తున్నాడు. అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో కూడా క్రేజీ బజ్ ఉంది. దీనికి తోడు ఈ సినిమాలో హీరోయిన్ గా సాయి పల్లవి నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు రెట్టింపయ్యాయి. పైగా లవ్ స్టోరీ సినిమాతో చై, సాయి పల్లవి జోడికి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఇప్పటికే ఒక షెడ్యూల్ పూర్తయిన ఈ సినిమా తదుపరి షెడ్యూల్ సెప్టెంబర్ చివరి వారంలో లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్ లో మొదలవుతుంది.
Read More: Varun Sandesh – Vithika Sheru: షాకింగ్… విడాకుల బాటలో మరో టాలీవుడ్ సెలబ్రిటీ కపుల్
అయితే తాజాగా చిత్ర యూనిట్ నుండి వచ్చిన సమాచారం ప్రకారం చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో రూపొందుతుందని తెలిసింది. అంతే కాదు చై మార్కెట్ ని మించి దాదాపు 80కోట్ల భారీ బడ్జెట్ తో సినిమా తెరకెక్కిస్తున్నారట. అయితే స్టోరీ లో కూడా అంత కంటెంట్ ఉందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. అయితే సినిమా నిర్మిస్తుంది స్వయానా అల్లు అరవింద్ కాబట్టి, స్క్రిప్ట్ విషయంలో ఆమాత్రం ఆలోచించే ఉంటాడు. ఈ సినిమా తో ఖచ్చితంగా నాగ చైతన్య మాస్ కమ్ బ్యాక్ ఇస్తాడని అక్కినేని ఫ్యాన్స్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు.
For More Updates :
Read More: Adipurush: ఓం రౌత్ మరోసారి రూమ్ లోకి వెళ్లుంటే బాగుండేదేమో..!
Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నాచురల్ స్టార్...
టాలీవుడ్ లో సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా...
తేజ దర్శకత్వంలో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి...
నేహా శెట్టి.. ఈ పేరుకంటే రాధిక అని పిలిస్తేనే...
ప్రస్తుతం చెన్నైలో మిచౌంగ్ తుఫాన్ తో...