NC23: చై తో మరోసారి కట్టనున్న సాయి పల్లవి!

NC23:

టాలీవుడ్ లో ఒక హీరో, హీరోయిన్లు కలిసి నటించాక ఆ సినిమా హిట్ అయితే, ఆ నటీనటుల మధ్య కెమిస్ట్రీ పండితే, ఆడియన్స్ మరోసారి ఆ కాంబో లో సినిమా రావాలని కోరుకోవడం సహజం. ఇలా చాలాసార్లు జరిగింది. ప్రభాస్ అనుష్క, రామ్ చరణ్ కాజల్, అల్లు అర్జున్ పూజ హెగ్డే ఇలా చాలా సక్సెస్ ఫుల్ కాంబోల్లో సినిమాలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి కాంబోయే మరోసారి రిపీట్ కాబోతుంది.

అక్కినేని నాగచైతన్య హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లవ్ స్టోరీ ఎంత పెద్ద హిట్టో అందరికి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన సాయి పల్లవి నాగ చైతన్య తో పండించిన కెమిస్ట్రీ కి ఆడియన్స్ ఫిదా అయ్యారు. ఒక రకంగా సాయి పల్లవి సినిమాకి మెయిన్ పిల్లర్ గా నిలిచి సక్సెస్ లో భాగమైందని చెప్పవచ్చు. ఇప్పుడు ఆ కాంబో మళ్ళీ రిపీట్ అవుతుందని సమాచారం.

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో వస్తున్న సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందంటూ ఎప్పట్నుంచో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ తెలుపుతూ తమ సినిమాలో నటిస్తున్న హీరోయిన్ గురించి చిన్నగా రివీల్ చేసారు. తనని చూపించకుండా మెల్లి మెల్లిగా బ్యాక్ నుండి చూపించడం జరిగింది. అయితే ఆ హీరోయిన్ హెయిర్ స్టైల్, ఇంకా చేతిలో రుద్రాక్ష కట్టును చూస్తే సాయి పల్లవి అని ఇట్టే తెలిసిపోతుంది.

- Advertisement -

ఇదే నిజమైతే విరాట పర్వం తర్వాత సాయి పల్లవి నటించే తెలుగు మూవీ ఇదే అవుతుంది. దాదాపు ఏడాదిన్నరగా సినిమా చేయని సాయి పల్లవి నాగ చైతన్య తో మరోసారి జోడి కడుతుందని చెప్పవచ్చు.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Gossips, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు