Dhanush New Movie: క్లాస్ డైరెక్టర్… అయినా ప్రొడ్యూసర్లు చెప్పిందే వినాలి

Dhanush New Movie

సౌత్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ అంటే.. రెహమాన్, అనిరుధ్, థమన్, దేవి శ్రీ ప్రసాద్ అనే పేర్లు మాత్రమే వినిపిస్తున్నాయి. జీవీ ప్రకాశ్, హేషామ్ అబ్దుల్ వహాబ్ తో పాటు చాలా మంది కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ తమ టాలెంట్‌తో సినిమాలను భుజాలపై లేపుతూ హిట్ ఇస్తున్నారు. కానీ, బ్రాండ్ అనే పేరుతో దర్శక నిర్మాతలు ఇంకా కొంత మంది మ్యూజిక్ డైరెక్టర్స్ నే నమ్ముకుంటున్నారు. అందుకోసం వాళ్లకు కోట్ల రూపాయలను కూడా వెచ్చిస్తున్నారు.

అంతే కానీ, ఖుషి, సార్ లాంటి మ్యూజికల్ హిట్స్ అందించిన సంగీత దర్శకులను ఎంపిక చేసుకోవడం లేదు. రీసెంట్ గా మరో సినిమాలో కూడా అవకాశం ఉన్నా.. బ్రాండ్ అనే పేరుతో పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ కే పట్టం కట్టారు. అది కూడా టాలీవుడ్ లో క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న శేఖర్ కమ్ముల.

శేఖర్ కమ్ముల ప్రస్తుతం ధనుష్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. D51 అంటూ అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. అయితే, ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా ముందుగా రెహమాన్ ను అనుకున్నారట. కానీ, డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో దేవి శ్రీ ప్రసాద్ ని ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తోంది. అయితే దేవి శ్రీ ప్రసాద్ ను ఎందుకు తీసుకున్నారు అనేది టాపిక్ కాదు. క్లాస్ సినిమాలు తీసే శేఖర్ కమ్ముల కూడా ఈ బ్రాండ్ మాయలో పడ్డాడు అనేది టాపిక్.

- Advertisement -

నిజానికి శేఖర్ కమ్ముల ఎలాంటి మ్యూజిక్ డైరెక్టర్ తో అయినా, మంచి అవుట్ పుట్ తీసుకురాగలడు. అతనికి స్టార్స్ అక్కర్లేదు.. ఆయన సినిమాలో చేస్తే వాళ్లే స్టార్లు అవుతారు. అలాంటిది రెహమాన్.. అనిరుధ్.. దేవి శ్రీ ప్రసాద్ అంటూ ఎందుకు చర్చ వచ్చింది అనేది ప్రశ్న. అయితే మ్యూజిక్ డైరెక్టర్ల విషయంలో శేఖర్ కమ్ములపై ప్రొడ్యూసర్ల ఒత్తిడి కూడా ఉందని తెలుస్తోంది.

అందుకే D51 సినిమాకి రెహమాన్, అనిరుధ్, దేవి శ్రీ ప్రసాద్ పేర్లను పరిశీలించి చివరికి దేవి శ్రీ ప్రసాద్‌ను ఫైనల్ చేశారట. దేవి శ్రీ ప్రసాద్‌కి కూడా ఈ మధ్య (పుష్ప మినహా) పెద్ద హిట్స్ ఏం లేవు. పేరుకు పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అనే ట్యాగ్ ఉంది. దానికి తగినట్టు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడు. కానీ, అతని నుంచి మంచి వర్క్ రావడం లేదనే టాక్ కూడా ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు