Jhansi: మళ్లీ పెళ్లికి సిద్ధం.. ఝాన్సీ మాటలకు అర్థం అదేనా..?

ఒకానొక సమయంలో బుల్లితెర యాంకర్ గా వ్యవహరించి ఆ తర్వాత పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్టు పాత్రలు పోషించి అటు బుల్లితెర ఇటు వెండితెర ప్రేక్షకులకు మరింత దగ్గరైన ఝాన్సీ గురించి పరిచయం ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం యాంకరింగ్ లో రాణించకపోయిన సరే సినిమాలలో కీలకపాత్రలు పోషిస్తూ బిజీయేస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఇండస్ట్రీలో మంచి పేరు దక్కించుకుంది. ఇకపోతే ఝాన్సీ చేసిన పాత్రలలో ఎన్నో చెప్పుకోదగ్గ పాత్రలు కూడా ఉన్నాయి. అలాంటి వాటిలో కోకాపేట ఆంటీ కూడా ఒకటి. ఇది ఆమెకు మంచి గుర్తింపును అందించింది.

ఇకపోతే ఝాన్సీ సినీ కెరియర్ ను పక్కన పెడితే ఆమె వ్యక్తిగత జీవితంలో అన్నీ విషాదాలే అని చెప్పాలి. ఈమె ప్రముఖ మేల్ యాంకర్ జోగినాయుడు ను ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. జోగినాయుడు యాంకర్ గానే కాదు పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించారు. దాదాపు 9 సంవత్సరాల పాటు వీరిద్దరి మధ్య ప్రేమాయణం కొనసాగిందని చెప్పాలి.

ఇక పెళ్లి అయ్యాక కొద్దిరోజులు కూడా కలిసి ఉండలేక.. పాప పుట్టాక ఇద్దరూ కూడా విడాకులు తీసుకున్నారు. అయితే విడాకుల తర్వాత జోగినాయుడు ఇంకొక అమ్మాయిని వివాహం చేసుకోగా.. ఝాన్సీ మాత్రం తన కూతుర్ని చూసుకుంటూ రెండో పెళ్లికి దూరం అయింది.

- Advertisement -

అయితే తాజాగా ఈమె మళ్లీ పెళ్లికి సిద్ధమైనట్లు సమాచారం. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఝాన్సీ తన రెండో పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేసింది. ఝాన్సీ మాట్లాడుతూ.. నా కూతుర్ని చూసుకోవడంతోనే నా సగం జీవితం అయిపోయింది. అయితే ఇంట్లో వాళ్ళు, స్నేహితులు, బంధువులందరూ మళ్ళీ పెళ్లి చేసుకోమని ఇబ్బంది పెడుతున్నారు. వాస్తవానికి మొదటి భర్తతోనే ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాను. అందుకే రెండో పెళ్లికి సిద్ధంగా లేనని, ఒకవేళ చేసుకోవాల్సి వస్తే మాత్రం నన్ను నన్నుగా అర్థం చేసుకొని .. నా వ్యక్తిత్వాన్ని సర్దుకుపోయే వ్యక్తి దొరికితే మాత్రం మళ్లీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అంటూ ఆమె తెలిపింది.

అంతేకాదు ఒక అమ్మాయి పెళ్లిని ఇష్టంతో చేసుకోవాలని.. పెళ్లి అనేది ఆమెకు బలం కావాలి తప్ప బలహీనత కాకూడదు అని.. తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. సంపాదించిన డబ్బు మొత్తం పోగొట్టుకున్నానని.. అందుకే రెండో పెళ్లి గురించి అంత తొందరగా నిర్ణయం తీసుకోలేక పోతున్నాను అంటూ తెలిపింది ఈ ముద్దుగుమ్మ. ఇక ఝాన్సీ చెబుతున్న మాటలు వింటుంటే కచ్చితంగా నచ్చిన వ్యక్తి దొరికితే మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పవచ్చు

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు