Biggboss season7: బిగ్ బాస్ హౌస్ లో మర్డర్?

టెలివిజన్ లో బిగ్ బాస్ సీజన్ 7 మరో నాలుగు వారాల్లో ఎండ్ అవబోతుంది. అందుకే ఇప్పుడు వస్తున్న టాస్క్ లు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా పెడుతున్నారు బిగ్ బాస్. ఇక లాస్ట్ వీక్ యావర్ తన ఎవిక్షన్ పాస్ బ్యాడ్జ్ ని వెనక్కి ఇచ్చేయడంతో, ఈ వారం ఎలిమినేషన్ కూడా జరగలేదన్న విషయం తెలిసిందే. అయితే ఈ వారం మాత్రం డబల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగార్జున చెప్పడం జరిగింది. అందుకే జరుగుతున్న టాస్క్ లు కూడా చాలా కఠినంగా ఉంటాయని అన్నారు.

ఇక యావర్ ఏవిక్షన్ పాస్ ని తీసుకున్న బిగ్ బాస్ మళ్ళీ ఆ టాస్క్ ని పెట్టడం జరిగింది. అయితే ఆ టాస్క్ లో చివరగా ప్రశాంత్, ప్రియాంక ల మధ్య జరగగా, ప్రశాంత్ విన్ అయ్యి ఏవిక్షన్ పాస్ ని గెలుచుకున్నాడు. ఆ వెంటనే నామినేషన్ ప్రాసెస్ కూడా జరిగిపోయింది.

ఇక అసలు విషయానికి వస్తే తాజాగా బిగ్ బాస్ హౌస్ లో ఘోరమైన హత్య జరిగింది. ఆడియన్స్ నమ్మకపోయినా ఇది నిజమని బిగ్ బాసే చెప్పారు. ఎందుకంటే హత్యకి గురయింది మిస్సెస్ బిగ్ బాస్.. ? ఈ విషయాన్నీ బిగ్ బాస్ ఇంటి సభ్యులకి స్వయంగా బిగ్ బాస్ చెప్పడం జరిగింది. అయితే ఇదంతా నిజం కాదు.. బిగ్ బాస్ ఇచ్చే ఓ టాస్క్ లో భాగమని షో చూసాక అర్ధమయింది. బిగ్ బాస్ హౌస్ లో అమర్, అర్జున్ తప్ప మిగతా హౌస్ మేట్స్ కి పార్టీ ఇచ్చిన బిగ్ బాస్, ఆ గ్యాప్ లో మర్డర్ జరిగిందని చెప్పాడు.

- Advertisement -

అయితే ఈ హత్య ఓ టాస్క్ అని అమర్, అర్జున్ లకి చెప్పి, ఆ టాస్క్ టెస్ట్ ని తెలివిగా ఛేదించాలని అమర్, అర్జున్ లని పోలీస్ లుగా మారి ఆ హత్య కి గల కారణాలని కనుక్కోమని చెప్పారు. ఇక పార్టీ అయ్యాక ఇతర హౌస్ మేట్స్ కి కూడా టాస్క్ విషయం చెప్పి ఆ టాస్క్ లో గెలవమన్నాడు. అయితే ఈ టాస్క్ దేని గురించో చెప్పలేదు బిగ్ బాస్. అయితే ఇంటి సభ్యుల అభిప్రాయం ప్రకారం ఇది కెప్టెన్సీ టాస్క్ లో భాగమని భావిస్తున్నారు. అయితే ఈ టాస్క్ ముగిశాకే బిగ్ బాస్ క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు