NTR30 : మరోసారి మెగా హీరోతో ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు తన తదుపరి చిత్రాలపై ఫోకస్ పెట్టారు. తారక్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన సినిమా ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా లెవెల్లో తెరికెక్కిన ఈ చిత్రం భారీ విజయాన్ని సాధించడంతో ఎన్టీఆర్ మంచి జోష్ లో ఉన్నాడు. అయితే తాజాగా కొరటాల శివ, ఎన్టీఆర్ హీరోగా ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక కొరటాల శివ, మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఆచార్య సినిమా ఈ మధ్య భారీ అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీసు వద్ద డిజాస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

అయితే కొరటాల శివ తన ఫోకస్ మొత్తం తన తదుపరి సినిమా పైనే పెట్టారు. ప్రస్తుతం ఎన్టీఆర్ 30 అనే వర్కింగ్ టైటిల్ తో వస్తున్న ఈ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో, యువ సుధా ఆర్ట్స్ పతాకంపై కొరటాల శివ సన్నిహితుడు సుధాకర్ మిక్కిలినేని నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలో కొంతమంది బాలీవుడ్ ప్రముఖ నటులు కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఈ సినిమాలో హీరో సాయిధరమ్ తేజ్ కూడా ఓ ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం.

ఈ చిత్రంలో ఎన్టీఆర్ కి బావమరిది పాత్రలో కనిపిస్తాడని, ఈ పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుందని చిత్ర పరిశ్రమలో వార్తలు వెలువడుతున్నాయి. కాగా ఈ విషయంలో త్వరలోనే అఫీషియల్ గా ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా వచ్చే వేసవిలో ప్రేక్షకులను అలరించనుంది. కాగా ఆచార్య వంటి డిజాస్టర్ తో ఉన్న కొరటాల శివ, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్ బాస్టర్ హిట్టుతో ఉన్న ఎన్టీఆర్ కాంబినేషన్లో వచ్చే ఈ పాన్ ఇండియా మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు