RC15 : చెర్రీ కోసం బాలీవుడ్ బ్యూటీ ?

“ట్రిపుల్ ఆర్” సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం తన తర్వాతి చిత్రంపై దృష్టి సారించాడు. శంకర్ దర్శకత్వంలో చరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయనున్నారు. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది. కియారా అద్వానీ కథానాయకగా నటిస్తుంది. అలగే రామ్ చరణ్ రెండు పాత్రలో కనిపిస్తారని సమాచారం. వాటిలో ఒకటి విద్యార్థి కాగా, మరొకటి ప్రభుత్వ ఉద్యోగి అని టాక్. “అధికారి” అనే టైటిల్ ని ఖరారు చేసినట్లు సమాచారం.

సినిమాలో ఎమోషన్స్, మాస్ ఎలివేషన్ సీన్స్ తో పాటు రొమాంటిక్ సిన్నివేశాలను శంకర్ తెరకెక్కిస్తున్నాడట. అందులో భాగంగా ఈ సినిమాలో ఒక ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. బాలీవుడ్ బ్యూటీ జాక్విలిన్ ఫెర్నాండస్ తో ఈ ఐటెం సాంగ్ చేయాలని శంకర్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తుంది. జాక్విలిన్ ఫెర్నాండస్ ఇప్పటికే సుదీప్ “విక్రాంత్ రోనా” చిత్రంలో రా రా రక్కమ్మ అనే ఐటెం సాంగ్ కు చిందేసింది.

ఈ పాట యువతకు సూపర్ గా నచ్చింది. దీంతో యూత్ ను దృష్టిలో పెట్టుకుని ఈ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేశారట. రామ్ చరణ్, జాక్విలిన్ ఫెర్నాండస్ మధ్య వచ్చే మాస్ స్టెప్పులు అద్భుతంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాగా దీనిపై అధికారికంగా ప్రకటన ఏదీ వెలువడలేదు. ఏది ఏమైనా రామ్ చరణ్ – శంకర్ ల సినిమాపై ఊహాగానాలు భారీగా నెలకొన్నాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు