Tollywood Actress: హీరోయిన్లను ఆ పనికి ఒప్పిస్తున్న దర్శకులు.. సై అంటున్న టాలీవుడ్ భామలు..

సినిమా రంగం అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ పైన కనిపించేదంతా రంగులే.. కానీ లోపలకు వెళ్లి చూస్తే ఎన్నో బాధలు, కష్టాలు, సుఖాలు ఎన్నో చీకటి కష్టాలు ఉంటాయి. ఇక్కడ ఒక అవకాశం కోసం ఎంతోమంది ఎన్నో పాట్లు పడతారు. సినిమాల్లో అవకాశాలు రావడం అంటే మామూలు విషయం కాదు. ఎన్నో కష్టాలు పడాలి. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే వీరు స్టార్ హీరోయిన్ గా మారడానికి ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా హీరోయిన్ కావాలనే ఆశతో, లేదంటే నటిగా రాణించాలనే ఆశతో వచ్చే వారికి మాత్రం కమిట్మెంట్లు, కాస్టింగ్ కౌచ్ లాంటివి ఎదురవుతుంటాయి.

సినిమాల్లో అవకాశాల కోసం చాలామంది హీరోయిన్లు నానా ఇబ్బందులు పడాలి. చివరికి వారు చేయకూడని పనులు కూడా చేయవలసి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే సినిమాలలో అవకాశాలు దక్కించుకోవడం కోసం హీరోయిన్లు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలాంటి సీన్లు చేయడానికి అయినా సిద్ధపడుతున్నారు. అవకాశాల కోసం హీరోలతో రొమాంటిక్ సన్నివేశాలు చేయడం, లిప్ లాక్ లు, అవసరమైతే బెడ్ రూమ్ సన్నివేశాలు కూడా చేయాలి. ఇటీవల వచ్చే ఇంటిమేట్ సీన్స్ అయితే ఏకంగా శృంగారం సన్నివేశాల్లాగే అనిపిస్తున్నాయి.

వీటి కంటే మలయాళ చిత్రాలు చాలా బెటర్ అనిపిస్తున్నాయి అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇటీవల మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన వెబ్ సిరీస్ లో కూడా విపరీతంగా రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే పాయల్ రాజ్ పుత్ మంగళవారం అనే సినిమాలో కూడా ఇలాంటి సన్నివేశాలలోనే కనిపించింది. ఇలా దర్శకులు ఇలాంటి సీన్లకు హీరోయిన్లను ఒప్పించడం ఒక ఎత్తైతే.. హీరోయిన్లు కూడా అసలు వెనుక పడడం లేదు. వారికి మరిన్ని అవకాశాలు వస్తాయని ఎలాంటి సీన్లలోనైనా నటించడానికి రెడీ అవుతున్నారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు