Telugu New Movie: పాపం అనిల్ సుంకరకే ఎందుకిలా? మరో నష్టం..!

టాలీవుడ్ లో ప్రముఖ నిర్మాత అనిల్ సుంకర పేరు చెప్పగానే… ఫస్ట్ అందరి నోటి నుంచి వచ్చేది.. పాపం అనిల్ సుకంర. ఎందుకంటే.. గత మూడేళ్ల నుంచి ఆయన చేసిన సినిమాలన్నీ ఫ్లాప్స్ గానే నిలిచాయి. ఇక ఏజెంట్ సినిమా ఇచ్చిన నష్టాల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత మెగాస్టార్ తో చేసిన భోళా శంకర్ కూడా బొక్క బోర్లా పడింది. దీంతో అనిల్ సుంకర కోలుకోలేని స్థితికి వెళ్లిపోయారు. ఖరీదైన తప్పులు చేశామని స్వయంగా అనిల్ ట్విట్ చేశాడంటే… ఆయన ఎంత వరకు నష్టపోయాడే అర్థమవుతుంది.

ఇప్పుడు ఆయనకు ఒక ప్రాపర్ హిట్ కావాలి. నష్టాల నుంచి బయటకి తీసుకురావాలి. అందు కోసం అనిల్ సుంకర డైరెక్టర్లను, హీరోలతో స్టోరీల కోసం చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో అనిల్ సుకంరకు ఓ యంగ్ హీరో ట్విస్ట్ ఇచ్చాడట. సినిమా చేస్తానని మాట ఇచ్చి ఇప్పుడు చేయనని వేరే ప్రొడ్యూసర్ల దగ్గరికి వెళ్లిపోయాడట. ఆ హీరో ఎవరో కాదు.. శర్వానంద్.

అనిల్ సుంకరకు సామజవరగమన అనే మూవీ హిట్ ఇచ్చాడు డైరెక్టర్ రామ్ అబ్బరాజు. ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కథతో అనిల్ సుకంరను సంప్రదిచారట. అయితే మరో నిర్మాత ఆసియన్ సునిల్.. తనకు ఈ ప్రాజెక్ట్ కావాలని అనిల్ సుంకరతో మాట్లాడి తీసుకున్నాడట. ప్రాజెక్ట్ అంతా ఫైనల్ అయ్యే టైంలో… ఆసియన్ సునిల్ తప్పుకున్నాడట. దీంతో డైరెక్టర్ రామ్ అబ్బరాజు.. అనిల్ సుంకర వద్దకు వెళ్దామని అంటే… తాను అనిల్ సుకంరతో చేయనని, మైత్రీ మూవీ మేకర్స్ బెటర్ ఆప్షన్ అని చెప్పారట శర్వా.

- Advertisement -

నిజానికి రామ్ అబ్బరాజు చేసిన స్టోరీ అనిల్ సుంకర తీయాలి. లేదా ఆసియన్ సునిల్ తీయాలి. కానీ, ఇద్దరికీ సంబంధం లేని మైత్రీ వాళ్లు ఎంట్రీ ఇస్తే.. ఒప్పుకునేదే లేదని అనిల్ సుంకర అంటున్నారట. పైగా మహా సముద్రం ఫ్లాప్ తర్వాత… అనిల్ తో మరో సినిమా చేస్తానని శర్వ మాట ఇచ్చారట. ఇప్పుడు అనిల్ తో సినిమా చేస్తే… రెమ్యునరేషన్ లో తగ్గింపు ఉండొచ్చు.. లేదా ఫ్రీగా అయినా చేయాల్సి వస్తుందేమో అని శర్వా మైత్రీ వాళ్ల సైడ్ వెళ్తున్నట్టు తెలుస్తుంది.

ఈ వ్యవహారం జరిగిన తర్వాత.. చివరికీ ప్రాజెక్ట్ ఉంటుందో.. లేదో అనే డౌట్ వచ్చే వరకు జరిగిందట. చూడాలి మరీ.. ఈ ప్రాజెక్ట్ ను శర్వా అన్నట్టు మైత్రీ మూవీ మేకర్స్ చేస్తుందా? లేదా అనిల్ సుంకర తన పంతాన్ని నెగ్గించుకుంటాడా?

Filmify gives an interesting update on celebrities in Tollywood & Bollywood and other industries. Also provides new movie release dates & updates, Telugu cinema gossip, and other Movies news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు