Biggboss season7: I am Here As a Bad Boy మీకేమన్న ప్రాబ్లమా? – అమర్ దీప్

బిగ్ బాస్ సీజన్ 7 లో తొమ్మిదో వారం నామినేషన్ల ప్రక్రియ మొదలవగా, ఈ వారంలో గత వారం జరిగిన నామినేషన్ల కి కొనసాగింపు గా, ఒక రివెంజ్ తీర్చుకుంటున్నట్టు నామినేషన్ల ప్రక్రియ సాగింది. అయితే ఈ నామినేషన్ల లో ఎక్కువగా భోలే షావలి, అమర్ దీప్, శోభా శెట్టి, ప్రియాంకలే ఒకరునికొకరు నామినేట్ చేసారు.

అయితే ఈ నామినేషన్ లో ప్రియాంక vs భోలే vs అమర్ దీప్ గా సాగింది. లాస్ట్ వీక్ ప్రశాంత్ ని నామినేట్ చేసే సమయంలో భోలే అమర్ ని పాయింట్ చేస్తూ మాట్లాడుతుంటే, అమర్ సీరియస్ అయ్యి స్టూల్ ని కాలితో తన్నాడని, ఆ ఇష్యూ పై భోలే నామినేట్ చేసాడు.

తిరిగి అమర్ దీప్ భోలే షావలి ని నామినేట్ చేస్తూ, ఈ విషయంపై భోలే తనని నామినేట్ చేసే విధానం నచ్చక, తిరిగి భోలే ని నామినేట్ చేస్తున్నానని రివేంజ్ తీర్చుకుంటున్నానని ఓపెన్ గా చెప్పేసాడు. ఈ విషయంపై భోలే కూడా సీరియస్ అవుతూ, ఈ హౌస్ లో అందరికంటే మంచి పేరు తెచ్చుకున్న నన్నే నామినేట్ చేస్తున్నావంటే బిగ్ బాస్ లో ‘చాలా బ్యాడ్’ అయిపోయావ్ నువ్వు అని అన్నాడు భోలే.

- Advertisement -

ఇక అక్కడితో వాదించి నీరసించిపోయిన అమర్ దీప్ అవును.. నేను బ్యాడ్ బాయ్ నే.. I am Here As a Bad Boy మీకేమన్న ప్రాబ్లమా? అని అన్నాడు. దీంతో భోలే మరింత సీరియస్ అయ్యాడు. అయితే ఇక్కడ ఇద్దరిలోనూ తప్పున్నా, భోలే తనని తాను మంచి వాడు అని, అమర్ ని చెడ్డ పేరు తెచ్చుకున్నాడని అన్న విషయంపై ఆడియన్స్ కి అడ్డంగా దొరికిపోయాడని అనిపిస్తుంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు