Mangalavaram: ఆసక్తికరంగా మంగళవారం ట్రైలర్ , అంచనాలు పెంచిన అజయ్

ఆర్ఎక్స్ 100 సినిమాతో దర్శకుడుగా ఎంట్రీ ఇచ్చిన అజయ్ భూపతి తన మొదటి సినిమాతోనే మంచి హిట్ అందుకున్నాడు. తన గురువు ఆర్జీవి లాగానే ఆర్ఎక్స్ 100 సినిమాతో ఎన్నో సంచలనాలు సృష్టించి వివాదాలకు కూడా దారి తీశాడు.  ఈ సినిమాకి ఫస్ట్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ నుంచి మిశ్రమ స్పందన లభించింది.  తర్వాత సింగిల్ స్కిన్ థియేటర్స్ లో ఈ సినిమా సాధించిన విజయం అద్భుతమని  చెప్పాలి.

ఆర్ఎక్స్ 100 సినిమా మంచి కలెక్షన్లు కొల్లగట్టి అజయ్ భూపతికి వరుస అవకాశాలను తీసుకొచ్చింది. ఈ సినిమా తర్వాత అజయ్ భూపతి చేసిన సినిమా “మహాసముద్రం” శర్వానంద్, సిద్ధార్థ హీరోగా నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా ఫెయిల్ అయింది. మహాసముద్రం సినిమా తర్వాత అజయ్ భూపతి చేస్తున్న సినిమా “మంగళవారం” ఈ సినిమాలో పాయల్ రాజ్ పుత్  మెయిన్ లేడిగా నటిస్తుంది.

“మంగళవారం” సినిమా ట్రైలర్ రీసెంట్ గా  విడుదల చేశారు.
ట్రైలర్ చూస్తుంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్  స్టోరీ అని అర్థమవుతుంది.
కాలం మారుతున్న కొద్ది పరిస్థితులు మారుతూ వస్తాయి అంటారు.
అలానే సినిమా ఇండస్ట్రీలో కూడా చాలా మార్పులు వచ్చాయి.
ఇప్పుడు మన కథను చెప్పడానికి మన దర్శకులు ఇష్టపడుతున్నారు.  మంగళవారం ట్రైలర్ చేస్తుంటే అలానే అనిపిస్తుంది.  మన విలేజ్లో జరిగే మన సిద్ధాంతాలు, మన నమ్మకాలు వీటన్నిటితో కూడుకున్న ఒక కథను ఇంట్రెస్టింగ్ గా  చెప్పే ప్రయత్నం చేశాడు అజయ్ భూపతి.

- Advertisement -

ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఆసక్తికరంగా అనిపిస్తుంది.
అజయ్ భూపతి షాట్స్, ఫ్రేమింగ్ ఇంకా ట్రైలర్ లోని కంటెంట్ కూడా ఆడియన్స్ ని ఆకట్టుకునేలా ఉంది. సినిమా కథను కూడా కొద్దిపాటిగా రివీల్ చేశారని చెప్పొచ్చు. ఒక ఊరిలో ప్రతి మంగళవారం కొందరు చనిపోవడాన్ని దానిలో చూపించారు.  అలానే గోడల మీద రాసిన కొన్ని రాతలను కూడా చూపించారు.  అసలు ఆ ఊర్లో ఏం జరుగుతుంది.? ఆ మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు.? అనే ఆలోచన రేకెత్తించేలా  ట్రైలర్ కట్ చేసారు.

ట్రైలర్ చూడగానే సినిమా పైన ఆశక్తి  కలుగుతుంది.  మొత్తానికి మహాసముద్రం ఓటమి నుంచి అజయ్  ఒక కొత్త పాఠం నేర్చుకుని,
ఈసారి మంగళవారం సినిమాతో మంచి హిట్ కొట్టడానికి రెడీ అయినట్లు అర్థమవుతుంది.  ట్రైలర్ మొత్తంలో ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది అజనీష్ లోకనాథ్ అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్.  అజనీష్ లోకనాథ్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు కాంతారా సినిమాతో అసలు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల ప్రేక్షకులకు కూడా ఫేవరెట్ అయిపోయాడు.

అందుకోసమే ఈ కాన్సెప్ట్ కి  కూడా అజనీష్ లోకనాథ్ కరెక్ట్ అని అజయ్ భూపతికి అనిపించి ఉండొచ్చు.  ఈ సినిమాలో అక్కడక్కడ కాంతారా సినిమాకి సంబంధించిన కొన్ని ఛాయలును కూడా మనం గమనించవచ్చు. ఈ సినిమా పాన్ ఇండియాలో పాన్ ఇండియా స్థాయిలో నంబర్ 17న రిలీజ్ కి సిద్ధంగా ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు