Ganapath: గణపథ్ బాలీవుడ్ పరువు మొత్తం పోయిందిగా..!

సప్త సముద్రాలు ఈదినవాడు పిల్లకాలువలో పడి చనిపోయినట్టు తయారయ్యింది ప్రస్తుతం బాలీవుడ్ పరిస్థితి. ఒకప్పుడు ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అనే రేంజ్ నుండి ఇప్పుడు సౌత్ సినిమాలు రీమేక్ చేసుకునే రేంజ్ కి దిగజారిపోయింది. కంటెంట్ పరంగా సౌత్ ని ఫాలో అవుతన్నప్పటికీ బాలీవుడ్ కి పెద్దగా హిట్స్ దక్కటం లేదు.

వరుస డిజాస్టర్స్ తో సతమతం అవుతున్న బాలీవుడ్ కి ఆపద్బాంధవుడిలా వరుసగా 1000కోట్ల సినిమాలు అందిస్తున్నాడు షారుఖ్ ఖాన్. అయితే, బ్లాక్ బస్టర్స్ తో షారుఖ్ బాలీవుడ్ ని బిల్డ్ చేస్తుంటే మిగతా హీరోలు కిల్ చేస్తున్నారు. ఇటీవల రిలీజైన టైగర్ ష్రాఫ్ సినిమా గణపథ్ అయితే బాలీవుడ్ అదః పాతాళానికి తొక్కేసినంత పని చేసింది. స్కైఫై థ్రిల్లర్ గా వచ్చిన ఈ సినిమా పేలవమైన విజువల్స్ తో ఆడియెన్స్ సహనానికి పరీక్ష పెట్టే విధంగా ఉంది.

ఈ సినిమాను చివరి వరకు కూర్చొని చూసినోళ్లకు సన్మానం చేయచ్చు అనే రేంజ్ లో విసిగిస్తుంది. హీరో పేరు గుడ్డు కావటంతో ‘ గుడ్డు సినిమా గుడ్డులాగా ఉందంటూ ‘ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్. అమితాబ్ లాంటి స్టార్ ని కూడా సరిగ్గా వాడుకోలేకపోయాడు డైరెక్టర్. టైగర్ ష్రాఫ్ సినిమాలంటే చీటికీ మాటికీ చొక్కా విప్పి సిక్స్ ప్యాక్ చూపించటం అనే తరహాలోనే ఈ సినిమా కూడా ఉంది.

- Advertisement -

దసరా బరిలో లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు ఉండటం వల్ల ఈ సినిమాను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు కానీ, లేకుంటే ట్రోలర్స్ కి స్టఫ్ గా మారి బాలీవుడ్ పరువు బజారున పడేది. జవాన్ సినిమా 1000కోట్లు కొల్లగొట్టిందన్న బాలీవుడ్ జనాల ఆనందంపై గణపథ్ సినిమా నీళ్లు చల్లింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు