Niharika Konidela :థై స్లిట్ డ్రెస్ లో మెగా డాటర్… ఏం ఉపయోగం ?

మెగా డాటర్ నిహారిక తాజాగా పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బ్లూ థై స్లిట్ డ్రెస్ లో ఈసారి నిహారిక ఓవర్ డోస్ గ్లామర్ లుక్ లో కనిపించింది. ఇప్పటిదాకా గిరి గీసుకొని కూర్చున్న ఈ బ్యూటీ ఇప్పుడు అందాలు ఆరబోయడానికి రెడీ అంటూ ఇలాంటి ఫోటోల ద్వారా మేకర్స్ కు సిగ్నల్ ఇస్తోంది. కానీ ఏం లాభం? ఆమె ఎంతగా అందాలు ఆరబోసినా చూడడానికి ప్రేక్షకులు ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ అస్సలు సిద్ధంగా లేరు.

“ఒక మనసు” అనే ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ తో నిహారిక హీరోయిన్ గా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీ కమర్షియల్ గా ప్లాప్ అయ్యింది. మొదటి సినిమాకే పెద్దగా రెస్పాన్స్ రాకపోయినా వెనకడుగు వేయకుండా హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం వంటి రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ లలో నటించి మెప్పించే ప్రయత్నం చేసింది. కానీ ఆ రెండు సినిమాలు కూడా నిహారికకు నిరాశనే మిగిల్చాయి. ఇలాగైతే లాభం లేదనుకుని మెగాస్టార్ చిరంజీవి పాన్ ఇండియా మూవీ ‘సైరా నరసింహారెడ్డి’లో చిన్న గెస్ట్ రోల్ లో కూడా కనిపించింది. కానీ ఆ తర్వాత కూడా ఈ బ్యూటీ కెరీర్ లో పెద్దగా మార్పులు ఏమీ రాలేదు. దీంతో చేసేది లేక గుంటూరుకు చెందిన వెంకట చైతన్య జొన్నలగడ్డను పెళ్లి చేసుకుని, ఒక ఇంటిదైపోయింది నిహారిక.

కానీ కనీసం రెండేళ్లు కూడా వీరి వైవాహిక బంధం సరిగ్గా సాగలేదు. మనస్పర్ధల కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో వీరిద్దరూ అధికారికంగా విడాకులు తీసుకున్నారు. అనంతరం నిహారిక తన కెరీర్ పై మరోసారి దృష్టి సారించింది. సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి ‘డెడ్ పిక్సెల్స్’ అనే టైటిల్ తో ఓ వెబ్ సిరీస్ చేసింది. దానికి ఓటిటి ప్రియుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. అంతేకాకుండా పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే తన నిర్మాణ సంస్థలో పలు చిత్రాలు చేయడానికి రెడీ అవుతోంది. నిర్మాతగా, నటిగా తనను తన నిరూపించుకునే అవకాశం కోసం వెయిట్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా నిహారిక షేర్ చేసిన గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. నిజానికి మెగా ప్రిన్సెస్ గ్లామరస్ లుక్ ను చూడడానికి మెగా ఫ్యాన్స్ పెద్దగా ఇష్టపడరు. అదే ఆమెకు శాపంగా మారింది. మరి ఈ బ్యూటీ సెకండ్ ఇన్నింగ్స్ లోనైనా నటిగా స్థిరపడి పోతుందా? అనేది చూడాలి.

- Advertisement -

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు