Salaar trailer : ప్రభాస్ ఎక్కడ ఫెయిల్ అవుతున్నాడంటే ?

డార్లింగ్ ప్రభాస్ హీరోగా నటించిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ “సలార్” ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ట్రైలర్ చూసిన చాలా మంది డిసప్పాయింట్ అయ్యారు. అంతేకాకుండా ఈ మూవీతో కూడా ప్రభాస్ కు మరో ప్లాప్ పడుతుందేమోనని ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

నిజానికి ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ కెరియర్ అంతా గందరగోళంగా మారింది. అనుకోని విధంగా ‘బాహుబలి’ మూవీ హిట్ కావడంతో, ప్రభాస్ క్రేజ్ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవెల్ కు ఎదిగిపోయింది. ప్రభాస్ కు ఒక్కసారిగా ఊహించని విధంగా ఫ్యాన్ బేస్ పెరగడంతో అప్పటికే ఆయన చేతిలో ఉన్న పలు సినిమాల కథల్లో మార్పులు చేస్తూ పాన్ ఇండియా లెవెల్ లో తీస్తూ వచ్చారు మేకర్స్. కానీ ఆ సినిమాలన్నీ ప్రభాస్ ను నిరాశపరిచాయి. దీంతో ‘బాహుబలి’ తర్వాత ఆ రేంజ్ హిట్ పడకపోవడంతో ప్రభాస్ ట్రోలింగ్ బారిన పడ్డాడు. ఈ హీరోకు అసలు యాక్టింగ్ తెలియదని, కేవలం లక్ వల్లే ఈ రేంజ్ హీరోగా ఎదిగాడని, బాహుబలి క్రెడిట్ మొత్తం రాజమౌళిదే నంటూ నెటిజెన్లు విరుచుకుపడ్డారు.

కానీ అసలు వాస్తవం ఏంటంటే ప్రభాస్ యాక్టింగ్ టాలెంట్ ను, ఆయన భారీ కట్ అవుట్ ను మేకర్స్ సరిగా ఉపయోగించుకోవడం లేదు. అంతేకాకుండా మరోవైపు ఈ స్టార్ హీరోకు ఉన్న ఫాలోయింగ్ శాపంగా మారింది. ‘బాహుబలి’ తర్వాత ఈ హీరో చేయబోయే ప్రతి సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఒక్కో సినిమాకు అంచనాలు ఒక్కో మెట్టు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. దీంతో ఆ భారీ అంచనాలను అందుకోవడానికి మేకర్స్ నానా తంటాలు పడుతున్నారు. ఆ ఎఫెక్ట్ కథపై పడుతుంది. కేవలం కథపై ఫోకస్ పెట్టకుండా ప్రేక్షకులను మెప్పించడంపైనే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు మేకర్స్. ఇంకేముంది సినిమా ఫలితం యావరేజ్ గా నిలుస్తోంది. అది కూడా ప్రభాస్ కారణంగానే.

- Advertisement -

ప్రభాస్ హీరో కాబట్టి ఆయన ఫ్యాన్స్ తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ సైతం థియేటర్లకు క్యూ కడుతున్నారు. దీంతో ఫస్ట్ డే కలెక్షన్స్ మాత్రం అన్నిచోట్ల అదిరిపోతున్నాయి. కానీ ఆ తర్వాత ఒక్కసారిగా కలెక్షన్స్ పడిపోతున్నాయి. దీనంతటికీ కారణం ప్రభాస్ సినిమాలపై భారీగా పెరుగుతున్న హైప్. ఆ హైప్ గనుక ఆ లెవెల్లో లేకపోతే ప్రేక్షకుల ఎక్స్పెక్టేషన్స్ ను రీచ్ కావడం అటు ప్రభాస్ కు ఇటు ఆయనను సిల్వర్ స్క్రీన్ పై చూపించే మేకర్స్ కు కొంతవరకు సులువు అవుతుంది. మరి ప్రభాస్ ఈ పరిస్థితిని ఎలా మేనేజ్ చేస్తాడో చూడాలి.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు