FinalePowerAstra: బిగ్ బాస్ సీజన్ 7 ఫస్ట్ ఫైనలిస్ట్ అర్జున్..

బిగ్ బాస్ సీజన్ 7 లో ఈ వారం మొత్తం ఫినాలే పవర్ అస్త్ర టాస్క్ మొదలైందన్న సంగతి తెలిసిందే. ఈ టాస్క్ లో ఉన్న ఎనిమిది మంది పోటీపడగా, ఒక్కో ఛాలెంజ్ లో ఒకో కంటెస్టెంట్ ఓడిపోతూ, టాస్క్ నుండి బయటికి వస్తూ, వాళ్ళ పాయింట్స్ ని కూడా ఆడుతున్న కంటెస్టెంట్స్ కి ఇస్తూ రావడం వల్ల ఆట ఇంట్రెస్టింగ్ గా సాగింది. ఇక ఈ టాస్క్ లో ఫైనల్ గా ఇద్దరు కంటెస్టెంట్స్ మిగిలారు.

వాళ్లే అర్జున్, అమర్ దీప్. ఇక వీళ్ళ మధ్య ఒకే ఒక్క ఛాలెంజ్ జరగగా, ఆ టాస్క్ లో అర్జున్ విన్ అయ్యాడు. ఆ విధంగా 10 రకాల ఛాలెంజ్ లు ఎదుర్కొన్న అర్జున్ అనూహ్యంగా ఫినాలే టాస్క్ పవర్ అస్త్ర విన్ అయ్యి నేరుగా ఫైనల్స్ కి చేరుకున్నాడు.

అయితే ఈ టాస్క్ లో అమర్ దీప్ కు వేరే కంటెస్టెంట్స్ సాక్రిఫైస్ చేసిన పాయింట్స్ వల్ల స్కోర్ బోర్డు టాప్ లో ఉండే సరికి అమర్ దీప్ ఫినాలే టాస్క్ గెలుస్తాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా అంబటి అర్జున్ చివరి మూడు టాస్కుల్లో సూపర్ గా టాప్ స్కోరర్ గా నిలిచాడు. ముఖ్యంగా ఈ టాస్క్ లో పెట్టిన అన్ని ఫిజికల్ టాస్కుల్లో అంబటి అర్జున్ టాప్ స్కోర్లు నమోదు చేయడం వల్ల ఫినాలే పవర్ అస్త్ర ని సునాయాసంగా గెలిచాడని చెప్పొచ్చు.

- Advertisement -

ఇక ఈ వారం వోటింగ్ లో కొంచెం మిగతా హౌస్ మేట్స్ కన్నా అర్జున్ కి తక్కువే వచ్చినా, లేటెస్ట్ గా ఫినాలే టాస్క్ లో విన్ అవడం వల్ల వోటింగ్ లో కూడా మంచి ప్లేస్ లో ఉన్నాడు.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు