Animal : నువ్వు మాత్రమే అలాంటివి చేయగలవు… సందీప్ పై రాజమౌళి కొడుకు కామెంట్స్

మొదటి సినిమాతోనే తనదైన స్టైల్ లో కల్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తాజా చిత్రం “యానిమల్” నిన్న రిలీజ్ అయిన విషయం తెలిసిందే. రణబీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే టాక్ తో సంబంధం లేకుండా సినిమా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. ఈ మూవీ మొదటి రోజే 100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి రికార్డులు క్రియేట్ చేసింది.

సినిమాపై ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా స్పందిస్తున్న నేపథ్యంలో తాజాగా దర్శకదీరుడు రాజమౌళి కొడుకు కార్తికేయ “యానిమల్” మూవీని చూశాక తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా పోస్ట్ రూపంలో తెలియజేశాడు. రణబీర్ కపూర్ యాక్టింగ్ అద్భుతంగా ఉందని, ఆయన “యానిమల్” సినిమా చేయడానికి పుట్టాడని, తనదైన ఊర మాస్ పర్ఫామెన్స్ తో అందరినీ కట్టిపారేశాడని అంటూ బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ పై ప్రశంసల వర్షం కురిపించాడు. ఇక హీరోయిన్ గా నటించిన రష్మిక మందన్న కూడా తనదైన స్టైల్ లో బాగా చేసిందని, ఇప్పటివరకు ఆమె చేసిన సినిమాల్లో ఇదే బెస్ట్ మూవీ అని, సెకండ్ హాఫ్ లో హీరో తో గొడవ పడే సన్నివేశం అద్భుతంగా ఉందని, అది తనకు బాగా నచ్చిందని కార్తికేయ చెప్పుకొచ్చాడు.

డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రస్తావిస్తూ. .. అలాంటి సన్నివేశాలను మీరు మాత్రమే ఊహించగలరు. ఆ ట్రాన్స్ నుంచి బయటకు రావడానికి చాలా టైం పట్టింది అంటూ “యానిమల్” మూవీపై ప్రశంసల జల్లు కురిపించాడు కార్తికేయ. ఆయన ట్వీట్ చూసిన సినీ ప్రియుడు “యానిమల్” మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజమౌళి సందీప్ రెడ్డి వంగా గురించి గొప్పగా మాట్లాడిన మాటలు గుర్తు చేసుకుంటూ సంబరపడిపోతున్నారు. ఇలా దిగ్గజ దర్శకుడు, ఆయన కొడుకు “యానిమల్” మూవీ గురించి పాజిటివ్ కామెంట్స్ చేయడం సినిమాకు మరింత కలిసొచ్చే అంశం అని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ రణబీర్ కపూర్ కు కల్ట్ క్లాసిక్ మూవీగా ఆయన కెరీర్ లోనే ఒక మైలురాయిగా మిగిలిపోతుందని అంటున్నారు. “యానిమల్” రిలీజైన ఫస్ట్ డేనే వరల్డ్‌వైడ్ గా 116 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిందని మేకర్స్ ఇప్పటికే అధికారికంగా పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మూవీ ఇదే స్పీడ్ లో దూసుకెళ్తే త్వరలోనే బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశం ఉంది.

- Advertisement -

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు