Hyper Adhi: రాత్రి 10 అయితే చాలు సుధీర్ చేసే పని అదే.. బండారం బట్టబయలు..!

జబర్దస్త్ లో కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించిన వారిలో హైపర్ ఆది , సుడిగాలి సుధీర్ , చమ్మక్ చంద్ర , వేణు వండర్స్, కిరాక్ ఆర్పి, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్ ఇలా చాలామంది కమెడియన్స్ సైతం ఉన్నారని చెప్పవచ్చు. ప్రస్తుతం ఇందులో చాలామంది జబర్దస్త్ కి గుడ్ బై చెప్పేసి పలు చిత్రాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. సుధీర్ ప్రస్తుతం హీరోగా సినిమాలు చేస్తూ ఉండగా హైపర్ ఆది బుల్లితెరపై, వెండితెర పైన మంచి పాపులారిటీ సంపాదించుకుంటూ ఉన్నారు.

హైపర్ ఆదికి సుధీర్ కి కూడా చాలా కామన్ గానే ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటారు. ఇటీవల సుధీర్ నటించిన కాలింగ్ సహస్ర కూడా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఈ సినిమా మిశ్రమ స్పందన ను అందుకున్నది..ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈటీవీలో ప్రసారమవుతున్నటువంటి పలు కార్యక్రమాలలో కూడా సుధీర్ సందడి చేయడం జరిగింది. అలా తాజాగా ఢీ షోలో కనిపించడం జరిగింది. అందుకు సంబంధించిన ఒక ప్రోమో కూడా వైరల్ గా మారుతున్నది.

ఈ ప్రోమోలో భాగంగా సుదీర్ ఎంట్రీ అవ్వడంతో హైపర్ ఆది సుధీర్ పట్ల భారీ పంచ్ డైలాగులు వేయడమే కాకుండా పెద్ద ఎత్తున ఇమిటేట్ చేయడం జరిగింది. అంతేకాకుండా సుధీర్ సీక్రెట్స్ అన్ని కూడా తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా హైపర్ ఆది మాట్లాడుతూ.. సుధీర్ రాత్రి 10:00 గంటల వరకే కాలింగ్ సహస్ర.. 10:00 గంటల తర్వాత కాలింగ్ గీత, కాలింగ్ సరళ ఆ తర్వాత కూలింగ్ అంటూ..లింగడి లింగడి అంటూ అసలు విషయాన్ని తెలియజేశారు హైపర్ ఆది.

- Advertisement -

ఇక అక్కడున్న వారందరికీ కూడా హైపర్ ఆది చేసిన ఈ కామెంట్స్ నవ్వుని తెప్పించాయి. మరోవైపు ప్లే బాయ్ గేమ్.. ఆడుతూ ఉండడం జరుగుతుంది. ఇక తర్వాత యాంకర్ ప్రదీప్, సుధీర్ మధ్య జరిగే సన్నివేశాలు కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించి ఈ ప్రోమో మాత్రం వైరల్ గా మారుతున్నది.బుల్లితెర పైన సుధీర్ అభిమానులు మాత్రం తనని బుల్లితెరపై రీఎంట్రీ ఇవ్వాలని కోరుకుంటున్నారు. సుధీర్, రష్మీ కలిసి జంటగా ఒక సినిమా కూడా చేయాలని కోరుకోవడంతో ఇటీవల సుధీర్ అందుకోసం తగ్గట్టుగానే కథలు వింటున్నామని ఏదైనా కథ నచ్చితే కచ్చితంగా చేస్తామని తెలియజేయడం జరిగింది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు