Biggboss season7: హౌస్ మేట్స్ తో ఫస్ట్ టైం తన బ్రేకప్ స్టోరీ ని పంచుకున్న గౌతమ్..!

బిగ్ బాస్ సీజన్ 7 మరో మూడు వారాల్లో ఎండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ సీజన్లో కూడా ఎనిమిది మంది హౌస్ మేట్స్ మాత్రమే మిగలగా. ఆ ఎనిమిది మంది మధ్య బిగ్ బాస్ ఫినాలే అస్త్ర టాస్క్ పెట్టడం జరిగింది. ఈ టాస్క్ విన్ అయిన వారు బిగ్ బాస్ హౌస్ లో నేరుగా ఫైనల్ కి చేరుకుంటారు అని బిగ్ బాస్ చెప్పగా, ఫినాలే అస్త్ర టాస్క్ కోసం అందరూ పోటీపడగా, కొన్ని నాటకీయ పరిణామల వల్ల అమర్ దీప్, అంబటి అర్జున్ ఫైనలిస్ట్ లు గా నిలిచారు.

చాలా మంది ఎక్కువ పాయింట్స్ ఉన్నందువల్ల అమర్ దీప్ విన్ అవుతాడని అనుకున్నారు. కానీ అనూహ్యంగా లాస్ట్ టాస్క్ లో అర్జున్ తన చాకచక్యంతో అమర్ దీప్ కన్నా ముందే ఛాలెంజ్ పూర్తి చేసి ఫినాలే అస్త్ర టాస్క్ గెలిచి, హౌస్ లో డైరెక్ట్ గా ఫైనల్ కి చేరిపోయాడు.

ఇదిలా ఉండగా ఈ టాస్క్ మధ్యలో బ్రేక్ టైం లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ యొక్క లవ్, ఇంకా లైఫ్ స్టోరీ ని కంటెస్టెంట్స్ తో పంచుకోమనగా, గౌతమ్ కూడా తన లవ్ స్టోరీ ని హౌస్ మేట్స్ తో పంచుకున్నాడు. కానీ అది బ్రేకప్ లవ్ స్టోరీ.

- Advertisement -

తనది అందరి లా సక్సెస్ ఫుల్ స్టోరీ కాదు, బ్రేకప్ స్టోరీ అంటూ, తాను mbbs ఢిల్లీ లో చేస్తున్నప్పుడు, తన ఫ్రెండ్ కి ఫ్రెండ్ అయిన ఓ అమ్మాయిని ఫస్ట్ టైం కలిసినపుడే ఇష్టమపడ్డానని, ఆ వెంటనే నెంబర్ కూడా తీసుకుని చిట్ చాట్ లు మెసేజ్ లు మొదలయ్యాయని, కొన్ని రోజులకే ‘యు వాంట్ ఇన్ మై లైఫ్’ అని ప్రపొజ్ చేసానని, వెంటనే అమ్మాయి కూడా యాక్సెప్ట్ చేసిందని అన్నాడు.

అయితే తనకు సినిమాలంటే ప్యాషన్ అని, సినిమాల్లోకి వెళ్లాలని అనుకుంటున్నానని తెలిసి, తన ఫ్యామిలీ వాళ్ళు ఒకే చెప్పలేదు. దానికి ఆ అమ్మాయి కూడా తన సినిమాలు వదిలేస్తావా అని అంది. దానికి ఒప్పుకోలేక, అది ఇష్టం లేక ఒకరికొకరు బ్రేకప్ చెప్పుకున్నామని అన్నాడు. అయితే ఈ స్టోరీ చెప్పాక గౌతమ్ ఎదో సినిమా స్టోరీ చెప్తున్నాడని ఆడియన్స్ కి అనిపించింది.

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు