December : టాలీవుడ్ ఫుల్లీ లోడెడ్… సినిమా జాతర షురూ

టాలీవుడ్ కు ఈ ఏడాది అద్భుతంగా ముగియబోతోంది. సాధారణంగా పెద్ద సినిమాల రిలీజ్ కు సంక్రాంతి టార్గెట్ గా మారుతుంది. కానీ డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి మేకర్స్ అంతగా ఆసక్తి చూపించరు. అయితే ఈ ఏడాది డిసెంబర్ మాత్రం బాక్స్ ఆఫీస్ కు మరిచిపోలేని విధంగా మారబోతోంది. పలు ఇంట్రెస్టింగ్, మోస్ట్ అవైటింగ్ మూవీస్ ఈ ఏడాది డిసెంబర్లో ప్రేక్షకులను పలకరించడానికి థియేటర్లలోకి రాబోతున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్ నుండే బాక్స్ ఆఫీస్ కు సంక్రాంతి కళ మొదలైనట్టుగా కనిపిస్తోంది. రెండు భారీ సినిమాలు, రెండు మిడ్ రేంజ్ హీరోల సినిమాలు రానుండగా, ఆ సినిమాలన్నీ హిట్ అయితే గనక మరోసారి బాక్స్ ఆఫీస్ షేక్ అవడం ఖాయం. మరి డిసెంబర్లో రిలీజ్ కానున్న సినిమాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

డిసెంబర్ 1వ తేదీన భారీ యాక్షన్ ఎంటర్టైన ‘యానిమల్’ మూవీ థియేటర్లలో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీ డిసెంబర్ మొదటి రోజే మోస్ట్ వైలెంట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చింది సినీ ప్రియులకు. ఇక రానున్న రోజుల్లో నేచురల్ స్టార్ నాని, యంగ్ హీరో నితిన్ కూడా తమ సినిమాలతో సినీ ప్రియులను ఎంటర్టైన్ చేయనున్నారు. మరోవైపు భారీ అంచనాలు ఉన్న ప్రభాస్ మూవీ ‘సలార్’ కూడా డిసెంబర్ లోనే రిలీజ్ కానుంది. అయితే డిసెంబర్ మిడ్ రేంజ్ హీరోలకు కలిసివచ్చే టైం అనిపిస్తోంది. ఈ ఇద్దరు మిడ్ రేంజ్ హీరోల సినిమాలకు పాజిటివ్ టాక్ గనుక వచ్చినట్లయితే, మంచి కలెక్షన్ రాబట్టే అవకాశం ఉంది.

నాని హీరోగా నటిస్తున్న “హాయ్ నాన్న” మూవీ డిసెంబర్ 7న రిలీజ్ కానుంది. ఈ సినిమాకు ఒకే ఒక రోజు గ్యాప్ తో నితిన్ హీరోగా నటించిన “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” విడుదల కానుంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ రెండు సినిమాలు 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేశాయి. అలాగే “హాయ్ నాన్న”, “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” సినిమాల ట్రైలర్లకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినిమాలపై అంచనాలు కూడా పెరిగాయి. అయితే ఈ రెండు సినిమాలు వేర్వేరు జోనర్లకు సంబంధించినవి కావడంతో ఇద్దరు హీరోల మధ్య డైరెక్ట్ పోటీ లేదు. కాబట్టి కంటెంట్ బాగుంటే రెండు సినిమాలు కూడా సక్సెస్ కావడం ఖాయం. అలాగే కలెక్షన్లు కూడా బాగానే రాబట్టుకునే అవకాశం ఉంది.

- Advertisement -

ఇక నెక్స్ట్ “సలార్” మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకిన విషయం తెలిసిందే. అయితే తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీ ట్రైలర్ కు మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. మరి థియేటర్లలో ఈ మూవీ ఎంతవరకు ఆకట్టుకుంటుంది అనేది సందేహంగా మారింది.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు