Summer movies: సమ్మర్ పోరు మహా జోరు

2023 సమ్మర్ లో చాలా సినిమా లు విడుదలకు సిద్ధమవుతున్నాయి. కేవలం ఏప్రిల్ లోనే 10 కి పైగా సినిమాలు విడుదల అవుతున్నాయి. దసరా మూవీ తో షురూ అయిన ఈ సమ్మర్ కాంపిటేషన్ మంచి శుభారంభం చేసింది. ఇక ఈ ఏప్రిల్ లో మాత్రమే విడుదల అవుతున్న కొన్ని సినిమాల గురించి తెలుసుకుందాం.

ముందుగా ఏప్రిల్ 7 న మాస్ మహారాజ్ రవితేజ నటించిన రావణాసుర చిత్రం భారీ హైప్ తో విడుదలకు సిద్ధం అవుతుంది. సుధీర్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ లో విడుదలవుతుంది. ఇక అదే రోజు అనగా ఏప్రిల్ 7 నే కిరణ్ అబ్బవరం నటించిన మీటర్ సినిమా కూడా విడుదల అవుతుంది. రమేష్ కదురి దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా క్లాప్ ఎంటెర్టైన్మెంట్స్ పథకం పై చెర్రీ నిర్మించారు. మరో సినిమా “1947 ఆగస్ట్16” అనే డబ్బింగ్ మూవీ కూడా ఏప్రిల్ 7నే విడుదల అవుతుంది. తమిళ నటుడు గౌతమ్ కుమారుడు కార్తీక్ గౌతమ్(కడలి ఫేం) ఈ సినిమాలో హీరో గా నటించాడు.

ఇక ఏప్రిల్ 14 న సమంత నటించిన “శాకుంతలం” పాన్ ఇండియా సినిమా గా భారీ అంచనాలతో విడుదలకు సిద్ధం అవుతుంది. గుణశేఖర్ దర్శకత్వం లో వస్తున్న ఈ సినిమా గుణ టీం వర్క్స్ పతాకం పై ఆయనే నిర్మించడం జరిగింది. మణిశర్మ సంగీతం అందించగా దిల్ రాజు ఈ సినిమాను దగ్గరుండి ప్రోమోట్ చేస్తున్నారు. ఇక అదే రోజు రాఘవ లారెన్స్ హీరోగా వస్తున్న రుద్రన్ సినిమా కూడా అదే రోజు విడుదల అవుతుంది. తెలుగు లో రుద్రుడు అనే పేరుతో డబ్ అయింది.

- Advertisement -

ఏప్రిల్ 21న మూడు సినిమాలు విడుదల అవబోతున్నాయి. సాయి ధరమ్ తేజ్ నటించిన విరూపాక్ష ఏప్రిల్ 21 న విడుదల అవుతుంది. ఈ సినిమా పై కూడా తెలుగులో మంచి అంచనాలున్నాయి. కార్తీక్ దండు అనే కొత్త దర్శకుడు ఈ సినిమాను డైరెక్ట్ చేసాడు. సుకుమార్ ఈ సినిమాకు కథ అందించడం తో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. ఇక మరో చిన్న సినిమా “నేను స్టూడెంట్ సర్ ” కూడా అదే రోజు విడుదల అవుతుంది. బెల్లంకొండ సురేష్ చిన్న కొడుకు బెల్లంకొండ గణేష్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఏప్రిల్ 21 న “హలో మీరా” అనే చిన్న సినిమా విడుదల అవుతుంది.

అయితే ఏప్రిల్ 28 న మాత్రం రెండు సినిమా ల మధ్య టఫ్ వార్ జరుగనుంది.ఆ రోజున తమిళ మోస్ట్ అవైటెడ్ ఫిలిం పొన్నియన్ సెల్వన్ 2 ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో పాన్ ఇండియన్ సినిమా గా విడుదల అవుతుంది. మణిరత్నం దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఏ.ఆర్ రహమాన్ సంగీతం అందించారు. భారీ మల్టీ స్టారర్ గా రానున్న ఈ సినిమాలో చియాన్ విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్య రాయ్, త్రిష, శోభిత ధూళిపాళ హీరో హీరోను గా నటించారు.

ఇక అదే రోజు దీనికి పోటీగా విడుదల అవుతున్న మరో సినిమా “ఏజెంట్”. అక్కినేని అఖిల్ హీరోగా నటించిన ఈ సినిమాకు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలున్నాయి. ak ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రామబ్రహ్మం ఈ సినిమాను నిర్మించారు. మలయాళ స్టార్ మమ్ముట్టి ప్రత్యేక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించింది.హిప్ హప్ తమిజా మ్యూజిక్ అందించగా, ఈ సినిమా కూడా పాన్ ఇండియా లెవెల్లో 5 భాషల్లో ఏప్రిల్ 28 న విడుదల అవుతుంది.

ఒక్క ఏప్రిల్ లోనే ఇన్ని సినిమాలు విడుదల అవుతుంటే తర్వాత మే లో మరెన్ని సినిమాలు విడుదల అవుతాయో సమ్మర్ వార్ ఇంకెంత హీటెక్కిస్తోందో చూడాలి.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు