Mahesh Babu: మహేష్ ఆ డైరెక్టర్ కి మళ్లీ ఛాన్స్ ఇస్తాడా ..?

ఒక్కోసారి మనం అనుకున్నవి జరగక పోగా పూర్తి నెగిటివ్ రిజల్ట్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సినిమాల విషయంలో చాలా సార్లు ఈ పరిస్థితి ఎదురవుతూ ఉంటుంది. సెన్సేషనల్ డైరెక్టర్ మురగదాస్, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుల కాంబో లో వచ్చిన స్పైడర్ సినిమా విషయంలో కూడా ఇదే జరిగింది. ఇప్పుడు స్పైడర్ సినిమా గురించి ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, 1947 మూవీ ప్రమోషన్ లో భాగంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో దర్శకుడు మురగదాస్ ఆ సినిమా తాలూకు చేదు అనుభవాన్ని గుర్తు చేసుకున్నారు కాబట్టి.

స్పైడర్ ఫెయిల్యూర్ పై విలేఖరులు అడిగిన ప్రశ్నకు స్పందించిన మురగదాస్రీ, రీమేక్ సినిమాలను పక్కన పెడితే, హిట్ – ఫ్లాప్ అన్నది సంబంధం లేకుండా ప్రతి సినిమాకు ఒకేలాగా కష్టపడతామని, స్పైడర్ సినిమాకు అలాగే కష్టపడ్డామని చెప్పుకొచ్చారు. అయితే, దర్శకుల క్రియేటివిటీ, ప్రేక్షకుల అంచనాలు మ్యాచ్ అయినపుడు సినిమా హిట్ అవుతుందని, అలా కానప్పుడు ఫెయిల్ అవుతుందని అన్నారు. స్పైడర్ ఫెయిల్యూర్ తనని నిరాశకు గురి చేసిందని, మహేష్ బాబు కి హిట్ ఇవ్వలేకపోయా అన్న బాధ ఇప్పటికి తనని వెంటాడుతోందని చెప్పుకొచ్చిన మురగదాస్.. మహేష్ తో తప్పకుండా మళ్ళీ సినిమా తీసి హిట్ కొడతానని ధీమా వ్యక్తం చేసారు.

ప్రస్తుతం అల్లు అర్జున్ సినిమా కోసం కథా చర్చలు జరుపుతున్న మురగదాస్, ఆ సినిమా గురించి విలేఖరులు ప్రశ్నించగా ప్రతి హీరో పది మంది దర్శకుల కథలు వింటారని, అలాగే ప్రతి దర్శకుడు పది మంది హీరోలను మీట్ అవుతూ ఉంటాడని, కలిసినంత మాత్రాన సినిమా కుదురుతుందని చెప్పలేమంటూ సమాధనం ఇచ్చారు. ఈ క్రమంలో మురగదాస్ మహేష్ ని అప్రోచ్ అవతారా? మహేష్ మళ్ళీ ఆయనకు ఛాన్స్ ఇస్తారా అన్నది వేచి చూడాలి.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు