Sukumar : సుకుమార్ సైలెన్స్ కు కారణం ఏంటీ..?

నిజం చెప్పులు వేసుకునేలోపు అబద్దం ఊరంతా చుట్టేస్తుంది అనే సామెత అందరం వినే ఉంటాం. ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో తరచూ జరిగే సంఘటనలు చూస్తుంటే ఈ సామెత గుర్తొస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకంటే, లెక్కల మాస్టారు సుకుమార్ గురించి హోరెత్తుతున్న గాసిప్స్ గురించి. సుకుమార్ శిష్యుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని హీరోగా నటించిన దసరా సినిమా సక్సెస్ అయిన విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఒక డెబ్యూ డైరెక్టర్ ని పెట్టి పాన్ ఇండియా సినిమా తీసినందుకు నాని ని అందరు ప్రశంసిస్తున్నారు. అలాగే మొదటి ప్రయత్నంలోనే పాన్ ఇండియా సక్సెస్ అందుకున్న డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల పేరు కూడా ఇండస్ట్రీ వ్యాప్తంగా మారుమోగుతోంది.

ఇదిలా ఉంటే, తన శిష్యుడు శ్రీకాంత్ ఓదెల ఇంత గ్రాండ్ సక్సెస్ సాధిస్తే, గురువు సుకుమార్ నుండి ఎలాంటి స్పందన లేదు. కనీసం సినిమా యూనిట్ ని మెచ్చుకుంటూ ఒక్కటంటే ఒక్క ట్వీట్ కూడా లేదు. ఇదే ఇప్పుడు గాసిప్స్ కి తావిస్తోంది. తన శిష్యుడు శ్రీకాంత్ తొలి ప్రయత్నంలోనే పాన్ ఇండియా సక్సెస్ అందుకోవటం సుకుమార్‌కి నచ్చలేదని, గురువుని మించిన శిష్యుడు అని శ్రీకాంత్ ఓదెలకు ఎక్కడ పేరొస్తుందో అని ఓర్వలేకపోతున్నాడు అంటూ రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. అయితే గతంలో సుకుమార్ శిష్యుడు చిట్టిబాబు ఉప్పెన సినిమా సమయంలో ప్రీ రిలీజ్ దగ్గర నుండి, సినిమా ప్రమోషన్స్ వరకు అన్ని తానై చూసుకున్నాడు సుకుమార్. అలాంటిది ఇప్పుడెందుకు సుకుమార్ సైలెంట్ గా ఉన్నారు అన్న ప్రశ్న అందరిలో ఉత్పన్నమవుతోంది.

సుకుమార్ సైలెన్స్ వెనక సరైన కారణమే ఉంది. అదేంటంటే, ప్రస్తుతం సుకుమార్ పుష్ప 2 షూటింగ్ కోసం శ్రీలంక, థాయిలాండ్ లో బిజీగా ఉన్నారని సమాచారం. సముద్రం బ్యాక్డ్రాప్ లో స్పెషల్ ఆక్షన్ సీక్వెన్స్ కోసం కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే దసరా సినిమా సక్సెస్ అయన నుండి స్పందన లేదు. ఇదన్నమాట విషయం, సుకుమార్ తన సినిమా పనుల్లో తాను బిజీగా ఉంటే మన నెటిజెన్స్ మాత్రం సుకుమార్ సైలెన్స్ పై తమ సొంత వార్తలు వండి వడ్డిస్తున్నరు.  ఇక్కడ గమనించాల్సిన మరో విషయం ఏంటంటే సుకుమార్ ఎన్నడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండింది లేదు. కుదిరితే స్వయంగా కలిసి తన ఆనందాన్ని పంచుకున్నాడు కానీ, గతంలో సక్సెస్ సాధించిన ఏ సినిమాను కూడా సోషల్ మీడియా ద్వారా అబినందించిన దాఖలాలు లేవు.

- Advertisement -

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు