Jalsa: పవర్ స్టార్ పెను విధ్వంసానికి 15 ఏళ్లు

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన జల్సా సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా అప్పట్లో సృష్టించిన సెన్సేషన్ అంతా ఇంతా కాదు. పవన్ కళ్యాణ్ కి ఖుషి తర్వాత వచ్చిన అసలైన సక్సెస్ ఇది. అందుకే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఈ సినిమా చాలా స్పెషల్. 2008 ఏప్రిల్ 2న జల్సా సినిమా విడుదలై సరిగ్గా నేటికి 15 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది. ఈ సంధర్బంగా జల్సా సినిమా విశేషాలను కొన్ని తెలుసుకుందాం.

ఖుషి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ కి ఏ సినిమా అంతగా కలిసి రాలేదు. జానీ, గుడుంబా శంకర్, బంగారం అట్టర్ ప్లాప్ అయ్యాయి. బాలు, అన్నవరం యావరేజ్ గా ఆడాయి. టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోకు ఇలాంటి పరాజయాలు రావడం ఫ్యాన్స్ కి అస్సలు మింగుడు పడలేదు. అప్పుడు పడింది జల్సా సినిమా. పవర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్లో పండగ చేసుకున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించగా, గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు అరవింద్ ఈ సినిమాని నిర్మించారు. దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమా కు సంగీతం అందించారు. పాటలన్ని సినిమా విడుదలకు ముందే సూపర్ హిట్స్ అయ్యాయి.

ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ మాజీ నక్సలైట్ గా, స్టూడెంట్ గా రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్నపాత్రల్లో కనిపించారు. ఇలియానా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, ముఖేష్ రిషి, కమలిని ముఖర్జీ, ఆలీ, బ్రహ్మానందం, ఉత్తేజ్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, సునీల్, శివాజీ తదితరులు నటించారు.

- Advertisement -

విడుదలైన రోజు నుంచే సూపర్ హిట్ టాక్ తో బాక్స్ ఆఫిస్ వద్ద భారీ కలెక్షన్లను నమోదు చేసింది. 34 కోట్ల షేర్ సాధించిన ఈ సినిమా పోకిరి తర్వాత హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 162 కేంద్రాల్లో డైరెక్ట్ గా 50 రోజులు ఆడిన ఈ సినిమా, 22 కేంద్రాల్లో 100 రోజులాడింది.

తాజాగా ఈ సినిమా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కానుకగా 2022 సెప్టెంబర్ 1 న రీ రిలీజ్ అయ్యింది. ఇప్పుడు కుడా జల్సా సినిమా కి ఫాన్స్ అలాగే హంగామా చేసారు. రీ రిలీజ్ లో ఈ సినిమా ఏకంగా 3.20 కోట్లు వసూలు చేసింది. తర్వాత ఈ రికార్డు ను ఖుషి బ్రేక్ చేసింది.

For More Updates :

Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు