Hi Nanna Censor : నాని సినిమాలో బూతు పదాలా !? హీరోయిన్ బ్యాక్ షాట్ కూడా కట్ !

భారీ అంచనాలున్న “యానిమల్” సినిమా నిన్న విడుదలై మిక్స్డ్ రెస్పాన్స్ రాట్టబడంతో, నెక్స్ట్ మూవీ “హాయ్ నాన్న”పైకి ఫోకస్ మెల్లగా అందరి ఫోకస్ మళ్లుతోంది. నేచురల్ స్టార్ నాని నటించిన “హాయ్ నాన్న” తండ్రీ కూతుళ్ల అనుబంధంతో తెరకెక్కుతున్న సాఫ్ట్ కార్నర్ మూవీ. ముఖ్యంగా ఈ మూవీతో ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే ప్రయత్నంలో ఉన్నాడు నాని. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ తో చాలామంది సినీ ప్రియులు కుటుంబ సమేతంగా సినిమాను వీక్షించడానికి ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

ఈ నేపథ్యంలో సినిమాలో బూతు పదాలు ఉన్నాయనే టాక్ నడవడంతో ఈ మూవీపై యూత్ దృష్టి కూడా పడింది. సినిమాలో రొమాన్స్ కూడా ఉంటుందని చెప్పకనే చెప్పేసాడు నాని. అయితే తాజాగా వచ్చిన సెన్సార్ రిపోర్ట్ తో ఫ్యామిలీ ఆడియన్స్ కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. కానీ యువతరానికి మాత్రం ఇది కాస్త నిరాశ కలిగించే విషయం. అయితే కంటెంట్ బాగుంటే అన్ని వర్గాల ప్రేక్షకులు ఈ మూవీని చూడడానికి ఆసక్తి చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి సెన్సార్ ఈ మూవీకి ఎన్ని కట్స్ చెప్పింది? ఎన్ని సన్నివేశాలను డిలీట్ చేసింది? అనే విషయానికొస్తే…

“హాయ్ నాన్న” మూవీ గత వారమే సెన్సార్ పూర్తి చేసుకుంది. నాని సినిమా కదా పెద్దగా కట్స్ ఏం ఉండవు అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. “హాయ్ నాన్న”U” సర్టిఫికెట్ తో 155 నిమిషాల రన్ టైమ్ తో ఉంది. ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ కు ఈ రన్ టైం పర్ఫెక్ట్ గా సరిపోతుంది. ‘ఫ**కింగ్ బి*చ్’ అనే పదాన్ని సబ్ టైటిల్ తో సహా మ్యూట్ చేయమని సూచించారట సెన్సార్ సభ్యులు. అలాగే హీరోయిన్‌ బ్యాక్ షాట్ ను కూడా రిమూవ్ చేయమన్నట్టు రిపోర్ట్ లో ఉంది. ఆ సన్నివేశం రెండుసార్లు ఉండగా, ఫస్ట్ టైం షాట్ సినిమాలో అలాగే ఉంటుంది. కానీ రెండవసారి ఆ సన్నివేశాలన్నీ వేరే సీన్ తో భర్తీ చేయమన్నారు. ప్రస్తుతం “హాయ్ నాన్న”కు సంబంధించిన సెన్సార్ రిపోర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ రిపోర్ట్ చూసిన వారంతా నాని సినిమాలో బూతు పదమా? అని షాక్ అవుతున్నారు. ఏదైతేనేం ట్రెండ్ ను ఫాలో అవ్వాలి కదా మరి.

- Advertisement -

కాగా “హాయ్ నాన్న” మూవీ డిసెంబర్ 7న విడుదలవుతోంది. శౌర్యువ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో మృణాల్ ఠాకూర్, కియారా ఖన్నా కీలక పాత్రల్లో కనిపించగా, శృతి హాసన్ ప్రత్యేక పాటలో కనిపించనుంది. డిసెంబర్ 1న రిలీజైన “యానిమల్” మూవీకి మిక్స్డ్ టాక్ రావడంతో “హాయ్ నాన్న” మూవీకి థియేటర్లలో రూట్ క్లియర్ అయ్యింది.

Get the latest celebrity news updates, Bollywood movie updates, and the latest news in Tollywood here at Filmify. Also, grab Filmify for the latest movie release dates & Tollywood gossip news, etc.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు