Guntur Kaaram Movie: మరో లీక్… మహేష్ ఇకనైనా కళ్ళు తెరిస్తే బెటర్

సూపర్ స్టార్ మహేష్ బాబు తాజా చిత్రం “గుంటూరు కారం” నుంచి మరో లీక్ బయటకు వచ్చింది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు అంచనాలు భారీగా ఉంటాయి. షూటింగ్ సెట్లో ఉండే కొంతమంది ఆతృతను అణచుకోలేక ఆ ఫోటోలను, లేదా వీడియోలను లీక్ చేస్తూ ఉంటారు. కానీ అలా లీకైన ఫోటోలు వీడియోలను చూసి సంబరపడడం కంటే సినిమాను వెండితెరపై చూడడమే బాగుంటుంది. ఇటీవల కాలంలో మేకర్స్ కు తలనొప్పిగా మారిపోయారు లీకు రాయుళ్లు. రీసెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించిన లీక్స్ జరుగుతూనే ఉన్నాయి.

అయితే అవి స్వయంగా మూవీ టీం నుంచి బయటకు రావడం గమనార్హం. “గుంటూరు కారం” మూవీకి కూడా ప్రస్తుతం అదే పరిస్థితి నెలకొంది. మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో చాలాకాలం తర్వాత వస్తున్న “గుంటూరు కారం” మూవీపై హైప్ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది. అయితే ఈ మూవీ స్టార్ట్ అయినప్పటి నుంచి లీక్స్ వస్తూనే ఉన్నాయి. వర్కింగ్ లొకేషన్ స్టిల్స్, ఫోటోలు వీడియోలు ఇలా ఏదో ఒకటి సోషల్ మీడియాలో లీక్ అవుతూనే ఉంది.

తాజాగా “దమ్ మసాలా” సాంగ్ కోసం మహేష్ రిహార్సల్స్ చేస్తున్న వీడియో ఒకటి లీక్ అయింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ వీడియోను సరిగ్గా గమనిస్తే షూటింగ్ సెట్స్ లో ఉన్న చిత్ర బృందంలోని ఓ వ్యక్తి స్వయంగా ఆ వీడియోను లీక్ చేసినట్టు స్పష్టంగా అర్థం అవుతుంది. ఇంతా జరుగుతుంది అసలు “గుంటూరు కారం” మేకర్స్ ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా? సినిమా నుంచి ఎలాంటి కంటెంట్ లీక్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మేకర్స్ దే.

- Advertisement -

డైరెక్టర్ త్రివిక్రమ్ ఈ విషయంలో ఫెయిల్ అయ్యాడు అని చెప్పొచ్చు. తన సినిమాకు సంబంధించి ఇన్ని లీక్స్ బయటకు వస్తున్నప్పటికీ టీంపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సినీ ప్రియులను ఆశ్చర్యానికి గురిచేస్తుంది. షూటింగ్ సెట్స్ లో తన టీంను త్రివిక్రమ్ కంట్రోల్లో పెట్టుకోకపోవడంపై మహేష్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. మరి ఇప్పటికైనా ఈ డైరెక్టర్ నిద్రలేచి “గుంటూరు కారం” మూవీ నుంచి వరుసగా లీక్స్ ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాడా లేదా? అనేది చూడాలి.

ఇప్పటికైనా మహేష్ బాబు, త్రివిక్రమ్ కళ్ళు తెరిస్తే బాగుంటుంది అని కోరుకుంటున్నారు ఫ్యాన్స్. ఇలా వరుసగా లీక్ అవుతున్న పిక్స్, వీడియోలు సినిమాపై నెలకొన్న ఆసక్తిని తగ్గించేస్తున్నాయి అని ఆందోళన పడుతున్నారు. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ చిత్రం “ప్రాజెక్టు కే” విషయంలో కూడా ఇలాంటి లీక్స్ జరిగినప్పుడు మేకర్స్ త్వరగా అలర్ట్ అయ్యి చట్టపరమైన చర్యలను తీసుకున్నారు. అంతేకాకుండా తమ సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్ బయటకు వచ్చినా తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

అప్పట్నుంచి “ప్రాజెక్ట్ కే”కు సంబంధించి ఎలాంటి లీక్ బయటకు రాలేదు. కానీ “గుంటూరు కారం” టీం మాత్రం ఇంకా కళ్ళు తెరవట్లేదు. చిత్రబృందం ఇప్పటికైనా పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి, ఆ లీక్స్ ను అరికట్టడానికి ప్రయత్నం చేస్తే బాగుంటుంది. లేదంటే సినిమా గురించి ఎదురు చూస్తున్న వారికి ఈ లీకుల కారణంగా నిరాశ తప్పదు. తద్వారా ఆ ఎఫెక్ట్ సినిమాపై పడే ప్రమాదం ఉంది.

Check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు