‘Lal Salaam’ Movie Review : ‘లాల్ సలాం’ మూవీ రివ్యూ

‘జైలర్’ తర్వాత రజినీకాంత్ చేసిన మూవీ ‘లాల్ సలాం’. ఇందులో రజినీకాంత్ హీరో కాదు.కానీ ఆయన ఉంటే చాలు, అలా నడిచొస్తే చాలు అనుకునే హార్డ్ కోర్ ఫ్యాన్స్.. ఈ సినిమా కోసం చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. రజినీకాంత్ కూతురు ఐశ్వర్య రజినీకాంత్ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేశారు. ‘లైకా ప్రొడక్షన్స్’ బ్యానర్ పై సుభాస్కరన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. పెద్దగా చప్పుడు చేయకుండా ఫిబ్రవరి 9 న రిలీజ్ అయిన ఈ మూవీ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం రండి :

కథ:
1993, కసుమూరు అనే ప్రాంతం. అక్కడ హిందువులు, ముస్లింలు ఐకమత్యంగా కలిసి ఉంటారు. మొయిద్దీన్ (రజినీ కాంత్) ఆ ఊరికి పెద్దలాంటి వ్యక్తి. అతనికి కొడుకు శంషుద్దీన్‌ను (విక్రాంత్) అంటే ప్రాణం. ముంబైలో మొయిద్దీన్ కుటుంబం ఉంటుంది. గురు (విష్ణు విశాల్) తండ్రి … మొయిద్దీన్ కి ప్రాణ స్నేహితుడు. అందుకే గురుని, శంషుద్దీన్‌ తో సమానంగా చూస్తాడు మొయిద్దీన్. అయితే గురు, శంషుద్దీన్‌..లకి పడదు. ఒకసారి క్రికెట్ మ్యాచ్ లో వీరి మధ్య గొడవ వస్తుంది. ఈ క్రమంలో గురు … శంషుద్దీన్‌ చెయ్యి నరికేసి రంజీ మ్యాచ్ లు వాడాలనుకునే అతని జీవిత లక్ష్యాన్ని దెబ్బతీస్తాడు. దీంతో మొయిద్దీన్ కి గురు పై కోపం వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది. మొయిద్దీన్ .. గురుని ఏం చేశాడు? అనేది మిగిలిన కథ.

విశ్లేషణ :
ఎంతో అనోన్యంగా ఉండే రెండు మతాల ప్రజలని తన స్వప్రాయాజనాల కోసం రాజకీయ నాయకులు వారిని ఎలా విడగొట్టి.. గొడవలు పెట్టారు అనేది ఈ సినిమా మెయిన్ పాయింట్ అనుకోవాలి. పాయింట్ కొత్తదేమీ కాదు. అలాంటప్పుడు టేకింగ్ బాగుంటే సినిమా పాసైపోతుంది. కానీ దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ తన టేకింగ్ లో కొత్తదనం ఏమీ చూపించలేదు. ఆకట్టుకునే అంశాలు కూడా ఏమీ జోడించలేకపోయింది. ఫస్ట్ హాఫ్ కొంతలో కొంత ఓపిక పట్టి చూడొచ్చు. కానీ సెకండ్ హాఫ్ లో సాగదీత ఎక్కువైంది. క్లైమాక్స్ వచ్చేసినట్టే ఉన్నా.. ఇంకా రాదు. దీంతో ప్రేక్షకుల సహనానికి పెద్ద పరీక్షే పెట్టిన ఫీలింగ్ కలుగుతుంది. ఈ సినిమాకి సరైన ఎండింగ్ కూడా ఉండదు. ఏదో హడావిడి హడావిడిగా ముగించేసిన ఫీలింగే కలుగుతుంది. రజినీకాంత్ కూతుర్లు డైరెక్టర్లుగా సక్సెస్ కాలేదు. ఐశ్వర్య రజినీకాంత్ గతంలో ‘3 ‘ తో సహా ఇంకో రెండు, మూడు సినిమాలు డైరెక్ట్ చేసింది. అందులో ఏదీ కూడా సక్సెస్ కాలేదు. రజినీకాంత్ రెండో కూతురు సౌందర్య రజినీకాంత్ కూడా ‘కొచ్చాడియాన్’ ‘విఐపీ 2 ‘ వంటి సినిమాలు డైరెక్ట్ చేశారు. అయితే అవి సినిమాల్లా ఉండవు. సీరియల్స్ మాదిరి ఫీలింగ్ ను కలిగిస్తాయి. సరే ‘లాల్ సలాం’ లో టెక్నికల్ గా అయినా ఏవైనా ఆకట్టుకునే విషయాలు ఉన్నాయా అంటే.. ఏ.ఆర్.రెహమాన్ సంగీతం మరీ ఓల్డ్ గా అనిపిస్తుంది. విష్ణు రంగసామి ఆంధిచిన కథ, సినిమాటోగ్రఫీ కూడా అంతే..! డైలాగ్స్ మాత్రం ఒకటి, రెండు పేలాయి అంతే. ప్రొడక్షన్ డిజైన్ కూడా ఆకట్టుకునే రేంజ్లో ఏమీ ఉండదు.

- Advertisement -

నటీనటుల విషయానికి వస్తే.. విష్ణు విశాల్, విక్రాంత్.. ఇద్దరూ పోటాపోటీగా నటించారు. విష్ణు విశాల్ పాత్ర వల్లే కథ మొత్తం నడుస్తుంది. అతని మార్క్ నటనతో కొంచెం ఎక్కువ మార్కులు వేయించుకుంటాడు. కానీ అందరి చూపు రజినీకాంత్ పైనే ఉంటుంది. రజినీ తన ఏజ్ కి తగ్గ పాత్ర చేశాడు అనుకోవచ్చు కానీ.. ఇది ఆయన ఇమేజ్ కి తగ్గ పాత్ర అయితే కాదు. సినిమా చూస్తున్నంత సేపు ఆయన అభిమానులు.. డైరెక్టర్ ఐశ్వర్య రజినీకాంత్ ను తిట్టుకుంటూనే ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. ఇక రజినీ భార్య పాత్రలో నిరోషా జస్ట్ కనిపించింది అనాలి, నటించింది అనలేం. చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన జీవిత మాత్రం సూపర్ గా నటించింది. అందులో ఎంత మాత్రం డౌట్ పడనవసరం లేదు. ఎక్కడా కూడా ఆమె నటనకి గ్యాప్ ఇచ్చిన ఫీలింగ్ కలగనివ్వలేదు. హీరోయిన్ అనంతిక పాత్రకి ఎటువంటి జస్టిఫికేషన్ ఇవ్వలేదు. ధన్య బాలకృష్ణ పాత్ర ఇలా వచ్చి అలా వెళ్ళిపోతుంది. మిగిలిన నటీనటుల పాత్రలు పెద్దగా రిజిస్టర్ కావు.

ప్లస్ పాయింట్స్ :

జీవిత నటన
విష్ణు విశాల్ నటన
విక్రాంత్ నటన
రజినీకాంత్ ఇమేజ్

మైనస్ పాయింట్స్ :

మిగిలినవన్నీ

మొత్తంగా.. ‘లాల్ సలాం’ సినిమాకి రజినీకాంత్ ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని వెళ్తే తీవ్రంగా నిరాశచెందడం గ్యారెంటీ. బి,సి సెంటర్ ఆడియన్స్ కి ఈ సినిమా యావరేజ్ అనిపించొచ్చు. మిగిలిన వాళ్లకి కష్టం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు