Yash : 20 రూపాయల ఫుడ్ కు రాకీ భాయ్ 1000 చెల్లించాల్సి వచ్చిందా? ఏమైందంటే?

Yash

కన్నడ స్టార్ యష్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. “కేజీఎఫ్” సినిమా ఆయనను దేశవ్యాప్తంగా పాపులర్ చేసేసింది. ఓవర్ నైట్ పాన్ ఇండియా స్టార్ అయిపోయిన యష్ తన సొంత పేరు కంటే “కేజిఎఫ్” సినిమాలోని ఆయన పాత్ర రాఖీ భాయ్ గానే ఎక్కువగా పాపులర్ అయ్యారు. అయితే ఈ హీరో 20 రూపాయల ఫుడ్ కు 1000 రూపాయలు చెల్లించాల్సి వచ్చిందట. అసలేం జరిగింది? అంటే…

స్టార్ అవ్వడానికి ముందు యష్ చాలా కష్టాలు పడ్డారట. కొన్నిసార్లు తిండి తినడానికి కూడా డబ్బులు లేక ఇబ్బందులు పడాల్సి వచ్చిందట. ఇప్పుడంటే కేజిఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ అయిపోయి కోట్లకు పడగలెత్తారు. కానీ ఒకప్పుడు ఆయన పడిన కష్టాలతో, యష్ జీవితంలో జరిగిన కొన్ని ఆసక్తికరమైన అంశాలతో ఒక మంచి సినిమా చేసేయొచ్చు. తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో యష్ ఒక హోటల్లో బ్రేక్ ఫాస్ట్ చేయడానికి వెళ్లి 20 రూపాయల ఫుడ్ తిని, వెయ్యి రూపాయలను ఎందుకు చెల్లించాల్సి వచ్చింది అనే విషయాన్ని వెల్లడించారు. తాను స్టార్ కావడానికి ఇబ్బందులు పడుతున్న సమయంలోనే ఆ హోటల్లో డబ్బులు ఇవ్వకుండానే అప్పుడప్పుడు బ్రేక్ ఫాస్ట్ చేసేవాడినని యష్ చెప్పుకొచ్చారు. ఆ హోటల్ యజమాని యష్ పరిస్థితిని అర్థం చేసుకుని ఎప్పుడూ డబ్బులు కూడా అడిగే వారు కాదట. అయితే అలాంటి మంచి వాడిని మోసం చేయాలని ఉద్దేశం లేకపోవడంతో స్టార్ అయ్యాక ఆ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానని చెప్పేవాడట యష్. అలా స్టార్ అయ్యాక ఒకరోజు అదే హోటల్ కు వెళ్లి బ్రేక్ ఫాస్ట్ చేసాడట. అయితే పాత బాకీ గుర్తొచ్చి 20 రూపాయల ఫుడ్ కు వెయ్యి రూపాయలు చెల్లించాడట. అంటే పాత బాకీని వడ్డీతో సహా ఇచ్చేసాడన్నమాట. ఆ హోటల్ యజమాని అయోమయంగా చూస్తూ ఉండడంతో మీ పాత బ్యాలెన్స్ కూడా ఇచ్చేశానని నవ్వుతూ చెప్పారట యష్. ప్రస్తుతం ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక కేజిఎఫ్ సీక్వెల్స్ తర్వాత యష్ మరో సినిమాలో కనిపించకపోవడంతో, ఆయన నెక్స్ట్ మూవీ గురించి అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే “టాక్సిక్” అనే కొత్త సినిమాలో యష్ హీరోగా నటిస్తున్న విషయాన్ని రీసెంట్ గా అధికారికంగా వెల్లడించారు. యష్ కెరీర్లో 19వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీకి లేడీ డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహించబోతున్నారు. ఈ మూవీతో పాటు ఆయన చేతిలో “కేజిఎఫ్ 3 ” కూడా ఉంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు