Yash Toxic: యష్ మూవీలో బాలీవుడ్ స్టార్స్.. తగ్గేదెలే..!

Yash Toxic

కన్నడ సినీ ఇండస్ట్రీ నుంచి ఒక తుఫాను లాగా వచ్చిన చిత్రం KGF, KGF-2.. ఈ సినిమాలతో ఓవర్ నైట్ కే స్టార్ హీరోగా భారీ క్రేజ్ అందుకున్నారు యష్. కే జి ఎఫ్-2 సినిమా విడుదలై ఘనవిజయం అందుకున్న ఒక ఏడాది తర్వాత మళ్లీ తన తదుపరి చిత్రం టాక్సిక్ అనే సినిమాని ప్రకటించారు. ఈ సినిమా వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.ఈ చిత్రాన్ని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు. KGF సినిమాల తర్వాత చాలామంది దర్శకులు హీరో యష్ తో సినిమాలు చేయడానికి ప్రయత్నించగా చివరికి గీతూ మోహన్ దాస్ కి అవకాశం ఇచ్చారు.

ఇటీవలే టాక్సిక్ చిత్రానికి సంబంధించి చిన్న గ్లింప్స్ రిలీజ్ కాగా భారీ రెస్పాన్స్ లభించింది. అప్పటినుంచి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటిస్తారనే విషయం పై కూడా అభిమానులు ఆతృతగా ఎదురు చేస్తున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక న్యూస్ వైరల్ గా మారింది. అదేమిటంటే టాక్సిక్ సినిమా నిర్మాతలు సన్నిహిత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఇందులో ఒక అతిధి పాత్రలో బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ పోషించడానికి సంప్రదించినట్లుగా తెలుస్తోంది.

ఒకవేళ షారుఖ్ ఖాన్ ఈ పాత్రను ఒప్పుకున్నారంటే కచ్చితంగా ఈ సినిమా భారీ కలెక్షన్లను కొల్లగొట్టడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. టాక్సిక్ సినిమా కూడా యాక్షన్, థ్రిల్లర్ సినిమా అన్నట్లుగా ఇప్పటికే క్లూ కూడా ఇచ్చారు. మరి షారుక్ ఖాన్ ఈ సినిమాలో అతిథి పాత్రలో నటించడానికి అంగీకరించారా లేదా అనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు. ఈ వార్త వినడంతో అభిమానులు మాత్రం చాలా థ్రిల్ కి గురవుతున్నారు. అసలు పరిచయమేలేని డైరెక్టర్ గీతూ మోహన్ దాస్ కి అవకాశం ఇవ్వడంతో మరింత మంది సర్ప్రైజ్ అవుతున్నారు.

- Advertisement -

ముఖ్యంగా మహిళాదర్శకురాలతో పని చేయడానికి ముఖ్య కారణం ఈ సినిమా స్క్రిప్ట్ పైన నమ్మకం ఉండడం వల్లే హీరో యష్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ గా కరీనాకపూర్ నటించబోతోంది అంటూ గత కొద్ది రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి. మరి అటు హీరోయిన్ పైన షారుఖ్ ఖాన్ పాత్ర పైన చిత్ర బృందం క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు