Prabahs vs Shahrukh : “సలార్”కు “జవాన్” సవాల్… ఈ రికార్డ్ బ్రేక్ చేస్తే ప్రభాసే నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్

ఇప్పుడు ఉన్న హీరోలలో నెంబర్ 1 పాన్ ఇండియా హీరో ఎవరు? ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఇదే చర్చ నడుస్తోంది. అయితే ఏ హీరోనైనా నెంబర్ 1 హీరోగా నిలబెట్టగలిగేది భారీ ఫ్యాన్ బేస్ తో పాటు, బాక్స్ ఆఫీస్ లెక్కలు. ఈ నేపథ్యంలోనే “సలార్”కు “జవాన్” సవాల్ విసిరితోంది. ఈ రికార్డ్ బ్రేక్ చేస్తే ప్రభాసే నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్. ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటే?

ప్రస్తుతం నెంబర్ 1 పాన్ ఇండియా స్టార్ అనిపించుకోవడానికి ప్రభాస్ తో షారుక్ పోటీపడుతున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు ఉన్న క్రేజ్ ను ఏ ఇతర బాలీవుడ్ హీరోలు సైతం బీట్ చేయలేకపోతున్నారు. కానీ లేటెస్ట్ గా షారుక్ మాత్రం తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. పాన్ ఇండియా రేస్ లో నెంబర్ వన్ స్టార్ హీరోగా తన ముద్ర వేసుకోవడానికి షారుక్ శతవిధాలా ప్రయత్నిస్తున్నాడు. నిజానికి ప్రభాస్ కు ఉన్నంత క్రేజ్ ప్రస్తుతం భారతదేశంలోని ఏ స్టార్ హీరోకు లేదనేది వాస్తవం.

కానీ డార్లింగ్ గతంలో వరుసగా మూడు డిజాస్టర్ లను అందుకోవడంతో నెంబర్ 1 ఎవరు అనే విషయంపై చర్చ మొదలైంది. అదే సమయంలో షారుక్ పఠాన్, జవాన్ వంటి సినిమాలతో వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకొని ప్రభాస్ కు గట్టి పోటీని ఇచ్చాడు. ఇక 2023 లో విడుదలైన ఈ రెండు సినిమాలు కూడా భారీ కలెక్షన్లను కొల్లగొట్టాయి. “జవాన్” మూవీ అయితే ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు చేసి మరోసారి బాక్స్ ఆఫీస్ వద్ద షారుక్ సత్తా ఏమిటో నిరూపించింది.

- Advertisement -

షారుక్ ఖాన్ హీరోగా నటించిన జవాన్ మూవీ ఇండియాలో 770 కోట్ల గ్రాస్, ఓవర్సీస్ లో 390 కోట్ల గ్రాస్ వసూలు చేసి, ప్రపంచవ్యాప్తంగా ఒక వెయ్యి ఒక వంద 1160 కోట్ల గ్రాస్ ను వసూలు చేసి 2023లో టాప్ గ్రాసర్ గా రికార్డును క్రియేట్ చేసింది. దీంతో ప్రస్తుతం ప్రభాస్ కు ఇది సవాల్ గా మారింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటించిన “సలార్” మూవీ డిసెంబర్ 22న థియేటర్లలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ మొదటి రోజు 170 కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టి, 2023లోనే భారీ కలెక్షన్లు కొల్లగొట్టిన మూవీ గా రికార్డును క్రియేట్ చేసింది. అయితే “సలార్” ముందున్న నెక్స్ట్ టార్గెట్ 1000 కోట్ల క్లబ్ లో చేరడం.

ఈ మూవీ కనక లాంగ్ లో అన్ని భాషల్లో కలిపి 1000 కోట్లు దాటేసింది అంటే “జవాన్” రికార్డును బ్రేక్ చేస్తుంది. అప్పుడు ప్రభాస్ నెంబర్ 1 హీరో అని ఎలాంటి సందేహం లేకుండా చెప్పుకోవచ్చు. కానీ జవాన్ రికార్డును బ్రేక్ చేయలేకపోతే మాత్రం 2023లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రంగా “జవాన్” నిలిచిపోతుంది. కానీ షారుక్ నటించిన తాజా చిత్రం “డంకీ” మూవీ అనుకున్న రేంజ్ లో ఆడకపోవడంతో ప్రభాస్ ఈ రేసులో నెంబర్ 1 హీరోగా నిలిచే అవకాశం లేదు. కాబట్టి ఎప్పటిలాగే మళ్లీ ప్రభాస్, షారుక్ మధ్య నెంబర్ 1 హీరో స్థానం కోసం పోటీ తప్పదు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు