Kalyan Ram: కళ్యాణ్.. ఇప్పటికైనా బింబిసార 2 పై క్లారిటీ ఇస్తారా..?

నందమూరి వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్న నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎక్కువగా కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా విభిన్నమైన కథాంశాలతో సినిమాలను తెరకెక్కిస్తూ తన నటనతో తనకంటూ ప్రత్యేకమైన మార్క్ క్రియేట్ చేసుకున్నారు. గతంలో వరుస సినిమాలు చేసి డిజాస్టర్ పాలైన కళ్యాణ్ రామ్ చాలా రోజుల తర్వాత బింబిసారా సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. అయితే ఆ సినిమా తర్వాత వచ్చిన సినిమాలు ఆయనను నిరాశపరిచాయి. దాంతో ఇప్పుడు డెవిల్ అనే సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు .

ఇక ఈ సినిమాతో మంచి సక్సెస్ సాధిస్తే కళ్యాణ్ రామ్ తనదైన రీతిలో ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటాడు అనడంలో సందేహం లేదు. ఇక ఒకవేళ ఈ సినిమా గనుక డిజాస్టర్ అయితే మళ్లీ కెరియర్ ఇబ్బందుల్లో పడుతుందని అభిమానులు తెగ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే కళ్యాణ్ రామ్ ఆచి తూచి అడుగులు వేయాలని.. సినిమా ఎంపికల విషయంలో జాగ్రత్త పడాలని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. మరోవైపు కళ్యాణ్ రామ్ కెరియర్ ఒక హిట్ మూడు ఫ్లాప్ లు అన్నట్టుగా సాగుతోందే తప్ప వరుసగా రెండు మూడు హిట్ లు అయితే ఆయన ఒక్కసారి కూడా ఇప్పటివరకు కొట్టలేదు

ఇక ఇప్పుడు డెవిల్ సినిమాతో సక్సెస్ కొట్టి ఆ తర్వాత వచ్చే సినిమాతో కూడా భారీ సక్సెస్ అందుకోవాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ వశిష్ట, హీరో కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో రావాల్సిన బింబిసారా 2 సినిమా వచ్చే సంవత్సరం సెట్ మీదకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై క్లారిటీ ఇవ్వలేదు.కానీ బింబిసారా 2 సినిమా వస్తుందని వార్తలు వినిపిస్తున్నాయి దీంతో అభిమానులు కళ్యాణ్ రామ్ అన్న ఇప్పటికైనా బింబిసార 2 పై క్లారిటీ ఇస్తారా? లేదా? అంటూ కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -

బింబిసారా సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న కళ్యాణ్ రామ్ ఈ సినిమా సీక్వెల్ తో మరొక విజయాన్ని అందుకోవాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఇకపోతే కొత్త టాలెంట్ ను ప్రోత్సహించే కళ్యాణ్ రామ్ వశిష్ఠ ను కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు. అంతేకాదు తన సినిమాల ద్వారా కొత్త హీరోయిన్ లకు అవకాశాలు కల్పించే ఈయన.. ఈసారి కెరియర్ పరంగా మరింత బిజీ కావాలని అభిమానులు, సెలబ్రిటీలు కూడా ఆకాంక్షిస్తున్నారు.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు