Animal: నెట్ ఫ్లిక్స్ కు వ్యతిరేకంగా సందీప్ వంగా డెసిషన్… ఈ డైరెక్టర్ కు అసలు సంగతి తెలీదా?

సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ “యానిమల్”. డిసెంబర్ 1న భారీ ఎత్తున విడుదలైన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటించారు. తండ్రి కోసం ఏమైనా చేసే కొడుకు కథ “యానిమల్”. ఈ సినిమా థియేటర్లలో ప్రేక్షకులను క్రేజీ అయ్యేలా చేసిన విషయం తెలిసిందే. 800 కోట్లకు పైగా వసూలను కొల్లగొట్టి బాక్స్ ఆఫీస్ ను దడ దడ లాడించింది “యానిమల్”. సినిమాలో స్త్రీ ద్వేషం, పురుష అహంకారం, మితిమీరిన వైలెన్స్ ఉందంటూ నెగిటివ్ రివ్యూలు వచ్చినప్పటికీ అవి సినిమాపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేకపోయాయి.

పైగా సినిమాకు ఫ్రీ పబ్లిసిటీని ఇచ్చాయి. దీంతో “యానిమల్” మూవీ కమర్షియల్ గా ఊహించని సక్సెస్ ను అందుకుంది. ఇక ఇప్పుడు ఈ మూవీ ఓటిటిలో ఎప్పుడెప్పుడు స్ట్రీమింగ్ కానుందా? అని ఎదురు చూస్తున్నారు ప్రేక్షకులు. ఈ నేపథ్యంలోనే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ యానిమల్ మూవీ విషయంలో దిగ్గజ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ రూల్స్ కు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం ఇంటర్వ్యూలతో ఫుల్ బిజీగా ఉన్న సందీప్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో “యానిమల్” ఓటిటి వర్షన్ గురించి క్లారిటీ ఇచ్చాడు. తాను ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ వర్షన్ ను ఎడిట్ చేస్తున్నానని, అందులో థియేటర్ వర్షన్ కంటే ఓటిటి వర్షన్ రన్ టైం 20 నిమిషాలు ఎక్కువగా ఉంటుందని వెల్లడించారు. మొత్తంగా యానిమల్ మూవీ ఓటిటి వర్షన్ మూడు గంటల 30 నిమిషాలు ఉండబోతోంది అన్నమాట.

- Advertisement -

అయితే ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేసే టైంలో ఒత్తిడి కారణంగా 8 – 9 నిమిషాలు కట్ చేయాల్సి వచ్చిందని, ఆ కట్ చేసిన ఫుటేజిని నెట్ ఫ్లిక్స్ వర్షన్ లో ఆడ్ చేయబోతున్నామని సందీప్ వెల్లడించారు. సినిమా రన్ టైం తగ్గించాలని డిస్ట్రిబ్యూటర్లు చేసిన ఒత్తిడికి లొంగలేదని సందీప్ గతంలో తెలిపాడు. కానీ ఇప్పుడు మాత్రం ఎక్కువ షోలు వేయడానికి బలవంతంగా 9 నిమిషాల సినిమాను కట్ చేయాల్సి వచ్చింది అనే విషయాన్ని ఒప్పుకున్నాడు. ఇదంతా ఓకే గాని అసలు సందీప్ రెడ్డి వంగకు నెట్ ఫ్లిక్స్ రూల్స్ తెలియదా?

రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ ఇకపై తమ ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబోతున్న సినిమాలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. థియేట్రికల్ వర్షం మాత్రమే విడుదల చేస్తామని, అన్ సెన్సార్డ్, లేదా ఎలాంటి ఎక్స్ట్రా సన్నివేశాలను జోడించి సినిమాను స్ట్రీమింగ్ చేయబోము అని వెల్లడించింది. కానీ సందీప్ మాత్రం “యానిమల్” మూవీకి మరో 20 నిమిషాల సన్నివేశాలను ఆడ్ చేసి రిలీజ్ చేస్తామని వెల్లడించడం ఆసక్తికరంగా మారింది.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు