Salaar: డైనోసార్ దండయాత్ర స్టార్ట్… ఇప్పుడు బాలీవుడ్ ముఖచిత్రం ఏమిటంటే?

సౌత్ వర్సెస్ నార్త్… ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఉన్న పరిస్థితి ఇది. ఇటీవల కాలంలో అద్భుతమైన భారీ పాన్ ఇండియన్ సినిమాలను అందించి బాలీవుడ్ ను అణగదొక్కేసిన సౌత్ గొప్ప అని దక్షిణాది ప్రేక్షకులు అంటుంటే, ఎప్పటికైనా మేమే బాక్స్ ఆఫీస్ కింగ్ అంటున్నారు నార్త్ సినీ ప్రియులు. ఇక ఈ భావం ప్రేక్షకుల కంటే స్టార్స్ కు ఎక్కువగా ఉంది అని చెప్పుకోవచ్చు.

రీసెంట్ గా “సలార్” మూవీకి నార్త్ లో కావలసినవి థియేటర్లు ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం. సలార్ సినిమాకు పోటీగా షారుఖ్ ఖాన్ నటించిన తాజా చిత్రం “డంకీ” రిలీజ్ అవుతుండడంతో ఎక్కువగా థియేటర్లను కేటాయించారు. ఎక్కువ థియేటర్లను షారుక్ సినిమాలకు కేటాయించి ప్రభాస్ సినిమాపై పక్షపాతం చూపించారు నార్త్ థియేటర్స్ యాజమాన్యం.

ఇటీవల కాలంలో బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ము రేపుతున్న సౌత్ స్టార్ హీరోలపై పైచేయి సాధించాలని బాలీవుడ్ స్టార్స్ అనుకుంటున్నారు అనడానికి ఇదే ఉదాహరణ. కానీ ఎక్కువమంది ప్రేక్షకులు మాత్రం నార్త్ సౌత్ అనే తేడా లేకుండా కంటెంట్ కే బ్రహ్మరథం పడుతున్నారు. దీంతో “డంకీ” మూవీ కంటే “సలార్” మూవీకి ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు జనాలు. మరి ఇలాంటి అప్పుడు సౌత్ సినిమాలను అవాయిడ్ చేసి బాలీవుడ్ సినిమాలకే భజన చేసే వాళ్ళ ముఖచిత్రాలు ఏమిటి? అంటే…

- Advertisement -

బాలీవుడ్ బాక్సాఫీస్ ను షేక్ చేసే సత్తా ఉన్న సౌత్ సినిమాలు విడుదలైనప్పుడల్లా బాలీవుడ్ కు చెందిన కొంతమంది విమర్శకులు కావాలని ఆ సినిమాలపై విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. కానీ బాలీవుడ్ సినిమాలను మాత్రం ఆల్ టైం ఫేవరెట్ అంటూ ఓ రేంజ్ లో ప్రమోట్ చేస్తూ ఉంటారు. హిందీ సినిమాలు ఎలా ఉన్నా సరే వాటిపై పాజిటివ్ గానే మాట్లాడుతారు. తాజాగా రిలీజ్ అయిన “డంకీ” వర్సెస్ “సలార్” విషయంలో కూడా అదే జరిగింది. సలార్ మూవీ రిలీజ్ కావడానికి ఒక వారం ముందు నుంచే నెగటివ్ చేయడం ప్రారంభించారు. పైగా సినిమా విడుదలయ్యాక చాలా తక్కువ రేటింగ్ లు ఇచ్చారు. కానీ బాలీవుడ్ కు సంబంధించిన కొన్ని పాపులర్ యూట్యూబ్ లలో వచ్చే రివ్యూలు మాత్రం పాజిటివ్ గా ఉన్నాయి. ఈ హై యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ సలార్ సినిమాకు వాళ్ళు 4-5 రేటింగ్స్ ఇవ్వడం విశేషం. ఇక ఈ నెగటివ్ టాక్ ఏది ప్రభాస్ సినిమాను ఆపలేకపోయింది. రెండు రకాల టాక్ వచ్చినప్పటికీ బాలీవుడ్ లో “సలార్” మూవీ భారీ కలెక్షన్లతో కొత్త రికార్డులు క్రియేట్ చేస్తోంది.

ఇటీవల రిలీజ్ అయిన “యానిమల్” మూవీ విషయంలో కూడా ఇలాగే జరిగింది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు పిచ్చిగా ఎగబడుతుంటే, బాలీవుడ్ క్రిటిక్స్ మాత్రం ఓ రేంజ్ లో ఏకిపారేసారు. రీసెంట్ గా జరిగిన ఇంటర్వ్యూలో “యానిమల్” డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ కూడా అదే రేంజ్ లో వాళ్లకు కౌంటర్ ఇచ్చాడు. ఏదేమైనా ఇక్కడ ప్రేక్షకుల తీర్పు ఏంటి అన్నదే ముఖ్యం. అంతేకాదు కంటెంట్ బాగుంటే భాషతో సంబంధం లేదు అనే విషయం ఎప్పుడో ప్రూవ్ అయింది. మరి ఈ విషయాన్ని కొంతమంది బాలీవుడ్ హీరోలు ఎప్పుడు అర్థం చేసుకుంటారో?

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు