Love Life Tips: మీ బాయ్ ఫ్రెండ్ లవ్ నిజమేనా? ఇలా తెలుసుకోండి

ప్రేమ అనేది ఈ రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. నిజానికి మనల్ని బాగా అర్థం చేసుకుని, అందరికంటే ఎక్కువగా ఇష్టపడే ఒక వ్యక్తి ఉండడం అదృష్టమే అని చెప్పాలి. అయితే ఈ రోజుల్లో ప్రేమ అనే ముసుగుతో ఎన్నో మోసాలు జరుగుతున్నాయి. మరి ఇలాంటి పరిస్థితులలో మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని నిజంగా ఇష్టపడుతున్నాడా ? అతను మిమ్మల్ని నిజాయితీగా ప్రేమిస్తున్నాడా? అనే విషయాలు ఎలా తెలుస్తాయి? కేవలం నిజాయితీగా ఉంటే సరిపోతుందా? ఇలాంటి ప్రశ్నలు మీకు కూడా ఎదురైతే మీకోసమే ఈ ఆర్టికల్. సైకాలజీ ప్రకారం మిమ్మల్ని ప్రేమించే వారిలో కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటి ద్వారా ప్రేమిస్తున్నాడు అనే విషయం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రేమలో ఉన్న ఇద్దరు వ్యక్తులు ఒకరి పట్ల మరొకరు శ్రద్ధగా, సన్నిహితంగా ఉంటారు. ఆ ఫీలింగ్ ఎంత మధురంగా ఉంటుందో దానివల్ల కలిగే నొప్పి అంతే భయంకరంగా ఉంటుంది. అంతేకాదు ప్రేమ కోసం త్యాగం కూడా చేయాల్సి వస్తుంది. అయితే మీ పార్టనర్ మిమ్మల్ని ఇష్టపడడం వల్ల కలిగే మధురమైన ఫీలింగ్ ను వర్ణించలేము. కానీ ఒకరి పట్ల ఒకరికి ఇష్టం, గౌరవం ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా విడిపోకుండా ఆ బంధం ఎక్కువ కాలం నిలుస్తుంది. సాధారణంగా కొంతమందిని చూస్తూ ఉంటాం. ఆ జంటలు ఎప్పుడూ ఒకరినొకరు తిట్టుకుంటూ, గొడవ పడుతూ, ఒకరినొకరు పెద్దగా ఇష్టపడనట్టుగా కనిపిస్తారు. కానీ ఎంత గొడవ జరిగినా కాసేపటి తర్వాత ఇద్దరూ కలిసిపోతూ ఉంటారు. అంటే దాని అర్థం వాళ్ళిద్దరికీ ఒకరిపై ఒకరికి విడదీయలేనంత ఇష్టం ఉందని అర్థం.

నమ్మకం అనేది ప్రేమకు దృఢమైన పునాది లాంటిది. ఇక మీ బాయ్ ఫ్రెండ్ మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు అనడానికి మరొక సైన్ అతను మీ పట్ల పాజిటివ్ గా ఉంటూ, ఎలాంటి పరిస్థితుల్లోనైనా మీకు సపోర్ట్ చేస్తూ ఉంటాడు. కష్టాల్లో ఉన్నా, సంతోషంగా ఉన్నా, పరిస్థితి ఏదైనా అతను మీ పట్ల ప్రవర్తించే విధానమే భవిష్యత్తులో కూడా అతను మిమ్మల్ని ప్రేమిస్తూ మీకు తోడుగా ఉంటాడు అనడానికి సంకేతం అవుతుంది.

- Advertisement -

సాధారణంగా తల్లిదండ్రులు పిల్లల మధ్య ఉండే అన్ కండిషనల్ లవ్ అందరికీ తెలిసిందే. కాబట్టి మీ బలాలు, బలహీనతలు, అవసరాల గురించి స్పష్టమైన అవగాహన ఉండి, మీ పట్ల దయతో ఉంటూ, మీ అవసరాలను తీరుస్తూ, మీపై అన్ కండిషనల్ లవ్ చూపిస్తున్నాడు అంటే మీ బాయ్ ఫ్రెండ్ ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టే. మరొక రకంగా చెప్పాలంటే అతను చూపిస్తున్న కేరింగ్ మీ తల్లిదండ్రుల కేరింగ్ లాగా ఉంది అనిపిస్తే అతనికి మీపై నిజమైన లవ్ ఉంది అని అర్థం.

ఎప్పుడూ మీ గురించే ఆలోచించకుండా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాడు అనిపిస్తే అతను నిజంగా మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టే. ఎందుకంటే తాజాగా జరిగిన ఒక అధ్యయనంలో కొంతమందిని తీసుకుని, వాళ్లకు నచ్చిన వ్యక్తుల ఫోటోలను ఇచ్చి సమయం గడపమని చెప్పారు. కానీ కొంతకాలం తర్వాత వచ్చిన రిజల్ట్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే కొంతకాలం తర్వాత వారిలో ఎక్కువ మంది తమకు నచ్చిన వాళ్లకు బ్రేకప్ చెప్పేశారు. కాబట్టి మిమ్మల్ని ప్రేమిస్తున్నారు అనడానికి ఇది కూడా ఒక మంచి సంకేతం.

అతని మిమ్మల్ని నమ్ముతున్నాడు అంటే అది కచ్చితంగా అతను మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నాడు అనడానికి మరొక మంచి సైన్. మిమ్మల్ని నమ్మే వ్యక్తి భవిష్యత్తులో మరింత బాగా ప్రేమించగలడు. అలాగే మీపై శ్రద్ధ వహించగలరు. అంతేకాకుండా మీతో ఆప్యాయంగా ఉన్నా, నిజాయితీగా తమ బలాలు, బలహీనతలు, కోరికలు, చేసిన తప్పులు వంటివి బయట పెట్టగలిగినప్పుడే అది నిజమైన ప్రేమ అవుతుంది. ఆ ప్రేమ ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఒకవేళ ఇలాంటి లక్షణాలు గనక మీ బాయ్ ఫ్రెండ్ లో కనిపిస్తే అతను ఖచ్చితంగా మిమ్మల్ని ప్రేమిస్తున్నట్టే. ఒకవేళ వీటిలో ఏ లక్షణాలు మీ బాయ్ ఫ్రెండ్ లో కనిపించకపోతే మీ లవ్ లైఫ్ గురించి ఒకసారి ఆలోచించాల్సిన సమయం వచ్చేసింది అని అర్థం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు