Devil : కాంట్రవర్సీ మూవీ “డెవిల్” బ్రేక్ ఈవెన్ ఎంతంటే?

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ స్పై యాక్షన్ థ్రిల్లర్ “డెవిల్”. “ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్” అనే ట్యాగ్ లైన్ తో రాబోతున్న ఈ మూవీకి అభిషేక్ నామా దర్శకుడిగా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్, మాళవిక నాయక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. డిసెంబర్ 29న భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ఇప్పటికే రిలీజ్ కాగా, దానికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది.

ఈ ట్రైలర్ మర్డర్ మిస్టరీతో మొదలై దేశభక్తి కోణంలో ముగియడం సినిమాపై ఆసక్తిని పెంచేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉంది. ఈ నేపథ్యంలోనే “డెవిల్” మూవీ బ్రేక్ ఈవెంట్ టార్గెట్ ఎంత అన్న విషయం బయటకు వచ్చింది. మరి కళ్యాణ్ రామ్ “డెవిల్”తో హిట్ కొట్టాలంటే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఎంత రాబట్టాలి? అనే వివరాల్లోకి వెళితే…

ఆంధ్రాలోని అన్ని ప్రాంతాలలో కలిపి ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ 9 కోట్లకు, సీడెడ్ లో 3.2 కోట్లు, నైజంలో ఆరు కోట్లు, ఇక మిగిలిన ప్రాంతాల్లో 3.5 కోట్లకు పైగా అమ్ముడు అయినట్టు సమాచారం. ఓవరాల్ గా చూసుకుంటే “డెవిల్” మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ బాగానే జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ విషయానికి వస్తే అన్ని ప్రాంతాల్లో కలిపి “డెవిల్ ” 25 కోట్ల షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. బ్రిటిష్ కాలం నాటి పీరియాడికల్ డ్రామా గారు రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించిన సెన్సార్ ఫార్మాలిటీస్ ఇటీవలే పూర్తయ్యాయి.

- Advertisement -

సెన్సార్ టీం డెవిల్ మూవీకి U/A సర్టిఫికెట్ ను జారీ చేయగా, సినిమా రన్ టైం 148 నిమిషాలు అని సమాచారం. ఈ నేపథ్యంలోనే డెవిల్ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ లిస్టును రిలీజ్ చేసింది చిత్రం బృందం. మరి ఎవరెవరు ఎక్కడెక్కడ రిలీజ్ చేయబోతున్నారు అనే వివరాల్లోకి వెళ్తే… “డెవిల్” మూవీని నైజాంలో గ్లోబల్ సినిమాస్, సీడెడ్ లో ఎస్ సినిమాస్, వైజాగ్ లో శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్, కృష్ణాలో అలంకార్ ప్రసాద్, ఈస్ట్ లో సురేష్ మూవీస్, గుంటూరులో పద్మావతి ఫిలిమ్స్, బెంగళూరులో సురేష్ మూవీస్, ఒరిస్సాలో రాజశ్రీ ఫిలిమ్స్, నార్త్ ఇండియాలో యుఎఫ్ఓ ఫిలిమ్స్, ఓవర్సీస్ లో ఫార్స్ ఫిలిమ్స్ కో.LLC, తమిళనాడులో ఎస్ఎస్సి మూవీస్ రిలీజ్ చేయబోతున్నాయి.

కాగా ఈ మూవీ డైరెక్టర్ విషయంలో జరిగిన రచ్చ అందరికీ తెలిసిందే. ముందుగా ఈ సినిమాకు ముందుగా డైరెక్టర్ నవీన్ మేడారం దర్శకత్వం వహించారు. కానీ ఆ తర్వాత దర్శకుడు, నిర్మాతకు మధ్య జరిగిన వివాదాల కారణంగా డైరెక్టర్ నవీన్ ఈ సినిమా నుంచి తప్పుకోవడంతో ప్రొడ్యూసర్ అభిషేక్ నామ దర్శకుడిగా తన పేరుని వేసుకున్నారు. ఇక ఈ విషయంలో “డెవిల్” సినిమాలో హీరోగా నటించిన హీరో కళ్యాణ్ రామ్ కూడా హ్యాపీగా లేడు అంటూ రూమర్స్ వచ్చాయి. ఎట్టకేలకు “డెవిల్” అన్ని వివాదాలను దాటుకుని డిసెంబర్ 29న రిలీజ్ కు రెడీ అవుతుంది. మరి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వస్తుందో తెలియాలంటే మరో నాలుగు రోజులు ఆగాల్సిందే.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు