Geeetha maadhuri: సింగర్ గీతా మాధురి గురించి సంచలన విషయాలు బయటపెట్టిన నందు..!

సింగర్ గీతామాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్ లో హస్కీ వాయిస్ తో మెస్మరైజ్ చేసే సింగర్ ఎవరంటే ఠక్కున గీత గుర్తొచ్చేస్తోంది. గీత వాయిస్ ని ఇట్టే గుర్తు పట్టేస్తారు అభిమానులు. సింగర్ గా బిజీ బిజీగా ఉన్నప్పుడే బిగ్ బాస్ లో అడుగుపెట్టి తనదైన ఆటతో అభిమానులను సంపాదించుకుంది. ఇక గీతా మాధురి – నటుడు నందు లది ప్రేమ వివాహం. 2014లో పెళ్లి చేసుకున్న వీరు ఎంతో అన్యోన్యంగా కలిసి మెలిసి ఉంటారు. వీరిద్దరి అన్యోన్య దాంపత్యానికి ప్రతీకగా ఓ పాప కూడా పుట్టింది.

వారి సరదా గొడవలను, అల్లరి పనులను ఈ జంట సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. అయితే రెండేళ్ల క్రితం నందు – గీత విడాకులు తీసుకోబోతున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. మనస్పర్ధల కారణంగా విడిపోతున్నారని టాకీ నడిచింది. కానీ ఈ రూమర్స్ ని వారిద్దరూ లైట్ తీసుకున్నారు. ఇదంతా అవాస్తవం అని చాలాసార్లు క్లారిటీ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఈ రూమర్స్ కి గట్టిగా చెక్ పెడుతూ గీతా మాధురి ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తాను రెండోసారి తల్లి కాబోతున్నట్లు ప్రకటించింది.

అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న గీతామాధురి భర్త నందు తమ బంధం గురించి, తమ కూతురు గురించి చాలా విషయాలు చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. గీతకి క్యాసినో అంటే పిచ్చి అని చెప్పుకొచ్చాడు. ఎక్కడికైనా వెళితే కచ్చితంగా క్యాసినో ఆడుతుందని.. అలా చాలా డబ్బులు పోగొట్టిందని తెలిపాడు. అలా అని కోట్లు ఏం పోగొట్టలేదని.. చిన్న మొత్తంలోనే పోగొట్టిందని క్లారిటీ ఇచ్చాడు. అలా తరచుగా డబ్బులు పోగొట్టడం తనకు నచ్చక గట్టిగా చెప్పడంతో అప్పటినుండి క్యాసినో ఆడడం మానేసిందని వెల్లడించాడు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు