Sankranthi Releases: తగ్గేదే లే అంటున్న ప్రొడ్యూసర్స్… చర్చలు ఫెయిల్

ఈ సంక్రాంతికి స్టార్ హీరోల సినిమాలు బరిలోకి దిగబోతున్న విషయం తెలిసిందే. అయితే ఒకటి రెండు సినిమాలు కాకుండా ఏకంగా ఐదు సినిమాలు సంక్రాంతి పోటీలో ఉండబోతున్నాయి. ఈ నేపథ్యంలో సినిమా విడుదల తేదీల గురించి తాజాగా జరిగిన ప్రొడ్యూసర్స్ చర్చలు ఫెయిల్ అయ్యాయి. ఏ నిర్మాత కూడా తమ సినిమాను వాయిదా వేసుకోవడానికి రెడీగా లేడు. పైగా ఎవరికి వారే తమ సినిమాల విషయంలో నమ్మకంగా ఉన్నారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం”, విక్టరీ వెంకటేష్ “సైంధవ్”, రవితేజ లేటెస్ట్ మూవీ “ఈగల్”, కింగ్ నాగార్జున “నా సామి రంగ”, తేజ సజ్జ హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా మూవీ “హనుమాన్” 2024 సంక్రాంతి కానుకగా రిలీజ్ కావడానికి రెడీ అవుతున్నాయి. సంక్రాంతి సీజన్ బాగా కలిసి వస్తుంది అన్న నమ్మకంతో ఈ హీరోలు తమ సినిమాలను రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ ఏ సినిమాకు కూడా సాలిడ్ స్క్రీన్ కౌంట్ లేకపోవడంతో బయ్యర్లు ఇలా ఒకేసారి ఇన్ని సినిమాలను విడుదల చేయడానికి రెడీగా లేరు.

టాలీవుడ్ కు బాగా కలిసి వచ్చే ఈ సంక్రాంతి హాలిడే సీజన్లో ఎన్ని సినిమాలను విడుదల చేయాలనే విషయంపై చర్చించేందుకు సంక్రాంతికి రిలీజ్ కాబోతున్న చిత్రాల నిర్మాతలు శుక్రవారం సమావేశం అయ్యారు. అయితే ఈ సమావేశంలో మేకర్స్ అందరూ తమ సినిమాలను విడుదల చేయడానికి ఆసక్తిని కనబరిచారు. ఏ నిర్మాత కూడా తమ సినిమాను వాయిదా వేయడానికి ఆసక్తి చూపకపోవడంతో ఈ చర్చలు సఫలం కాలేదు. ప్రస్తుతానికి ఈ సమావేశాన్ని దాటవేశారు. మరోసారి నిర్మాతల మధ్య చర్చలు జరిగే అవకాశం ఉంది.

- Advertisement -

అయితే నాగార్జున నటిస్తున్న “నా సామి రంగ” మూవీ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఒక్క డీల్ కూడా ఇప్పటిదాకా క్లోజ్ కాకపోయినా సంక్రాంతికి తమ సినిమాను విడుదల చేయాలని గట్టి పట్టుదలతో ఉంది చిత్ర బృందం. మరోవైపు మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఈగల్” కు సంబంధించిన నాన్ థియేట్రికల్ డీల్స్ ఇంకా క్లోజ్ కాలేదు. అయినప్పటికీ ప్లాన్ ప్రకారం తమ చిత్రాన్ని అనుకున్న సమయానికే విడుదల చేయడానికి రెడీ అవుతోంది “ఈగల్” టీం.

ఇక వెంకటేష్ “సైంధవ్”, తేజ సజ్జ నటిస్తున్న “హనుమాన్” సినిమాల షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. వీళ్ళ సినిమాలకు సంబంధించిన డీల్స్ కూడా ఇప్పటికే క్లోజ్ అయ్యాయి. ప్రస్తుతం ఈ రెండు చిత్రాల టీమ్స్ తమ సినిమాలను ప్రమోట్ చేసుకోవడంలో బిజీగా ఉన్నారు. ఇక 2024 లో రిలీజ్ కాబోతున్న మరో మూవీ “గుంటూరు కారం”. ప్రస్తుతం ఈ టీం షూటింగ్ చివరి దశలో ఉంది. ఇక ఈ సంక్రాంతికి విడుదల కాబోయే సినిమాల ఫైనల్ రిలీజ్ లిస్ట్ బయటకు రావాలంటే మరికొంత కాలం ఆగాల్సిందే.

check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు