Anasuya: ఫ్యామిలీతో ప్రత్యేక పూజలు చేస్తోన్న అనసూయ.. కారణం..?

బుల్లితెరపై స్టార్ యాంకర్ గా కొనసాగుతూ భారీ పాపులారిటీ దక్కించుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తన అందంతో.. వాక్చాతుర్యంతో జబర్దస్త్ కార్యక్రమంలో మరింత పాపులారిటీ దక్కించుకున్న అనసూయకి సినిమాలలో వరుసగా అవకాశాలు క్యూ కట్టడంతో జబర్దస్త్ కి కాస్త గుడ్ బాయ్ చెప్పి సినిమాలకే పరిమితమయ్యింది. ముఖ్యంగా పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న అనసూయ.. లేడీ ఓరియంటెడ్ చిత్రాలతో కూడా ప్రేక్షకులను అలరిస్తోంది. ఇకపోతే నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ.. తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని అభిమానులతో షేర్ చేసుకోవడమే కాదు సమాజంలో జరిగే ప్రతి విషయంపై కూడా స్పందిస్తూ అప్పుడప్పుడు కాంట్రవర్సీకి కూడా గురి అవుతూ ఉంటుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈమె ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ కనిపించింది. తాజాగా ఒక దేవాలయంలో పూజలు చేస్తూ కనిపించిన అనసూయ అందుకు సంబంధించిన ఫోటోలను కూడా షేర్ చేసింది. కుటుంబ సభ్యులతో కలిసి శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సాంప్రదాయ దుస్తుల్లో కనిపించిన ఈమె తన కుటుంబీకులతో కూడా కలిసి ఫోటోలు దిగి వాటిని సోషల్ మీడియాలో షేర్ చేసింది.ప్రస్తుతం ఈ ఫోటోలు చాలా వైరల్ గా మారుతున్నాయి. ఇకపోతే అనసూయ లేటెస్ట్ ఫ్యాషన్ కి ఎంత ప్రాధాన్యత ఇస్తుందో.. హిందూ సాంప్రదాయాలు, ఆచారాలకు కూడా అంతే ప్రాధాన్యత ఇస్తుంది. ఈ సందర్భంగా ఆమె దైవభక్తిని చూసి అనసూయను అభిమానులు మెచ్చుకుంటున్నారు. ఎప్పుడు ఇలా నిండుగా కనిపించాలని కోరుకుంటున్నారు. అంతేకాదు తన కుటుంబానికి మంచి జరగాలని కూడా ఆశిస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం శ్రీకాళహస్తీశ్వర దేవాలయంలో అనసూయ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇక అవి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అనసూయ బిగ్ స్క్రీన్ కెరియర్ విషయానికి వస్తే.. రంగమార్తాండ, విమానం వంటి చిత్రాలలో నటించగా.. ప్రస్తుతం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 లో దాక్షాయినిగా నటిస్తోంది. ఇక ఈ సినిమాతో పాటు మరికొన్ని సినిమాలలో అనసూయకు అవకాశాలు వచ్చినట్లు సమాచారం. ఏది ఏమైనా అటు కెరియర్ పరంగా ఇటు వ్యక్తిగత పరంగా మరింత సక్సెస్ అవ్వాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు