Salaar part2: ఇలా జరిగితే… శౌర్యంగా పర్వంలో ప్రభాస్ VS రానా…

ప్రభాస్ అభిమానులు చాలా రోజుల నుంచి కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న “సలార్” ఎట్టకేలకు శుక్రవారం థియేటర్లోకి వచ్చేసింది. వరుసగా మూడు ఫ్లాపులు అందుకున్న తర్వాత ప్రభాస్ ఈ సినిమాతో ఊహించని రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం ప్రేక్షకులను థియేటర్లలో కేక పెట్టిస్తున్న “సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” ఫస్ట్ డే భారీ కలెక్షన్లు రాబట్టి పలు రికార్డులను బ్రేక్ చేసింది.

మరి లాంగ్ రన్ లో ఈ మూవీ ఎన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందో అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇక “సలార్” సెకండ్ పార్ట్ కూడా ఉండబోతున్న విషయం తెలిసిందే. “సలార్” మూవీ ఎండ్ అయ్యాక పార్ట్ 2 టైటిల్ ను ప్రకటించి, థియేటర్లలోని ప్రేక్షకులను థ్రిల్ చేశారు మేకర్స్. దీంతో ఇప్పటికే సలార్ మూవీని వీక్షించిన ప్రేక్షకులు కొంతమంది సెకండ్ పార్ట్ ఎలా ఉండబోతుంది అనే విషయంపై డిస్కషన్ స్టార్ట్ చేశారు.

“సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్” ప్రేక్షకుల అంచనాలను అందుకుని బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తోంది. అయితే ఫస్ట్ పార్ట్ ను జస్ట్ సెకండ్ పార్ట్ కి ఇంట్రడక్షన్ గా మాత్రమే వాడుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. మరి కేవలం ఇంట్రడక్షన్ పార్ట్ ఇలా ఉంటే అసలు కథ ఏ లెవెల్ లో ఉంటుందో ఊహించడం కూడా కష్టం అంటున్నారు నెటిజెన్లు. ఇక ప్రాణ స్నేహితులైన ఇద్దరు మిత్రులు, బద్ధ శత్రువులుగా మారడం సెకండ్ పార్ట్ లో ఉంటుంది. కాబట్టి అప్పుడు సినిమాలో జరిగే విధ్వంసంతో థియేటర్లు బద్దలవ్వడం ఖాయం.

- Advertisement -

ఈ నేపథ్యంలోనే కొంతమంది జస్ట్ ఇమాజిన్…సెకండ్ పార్ట్ లో రానా వర్సెస్ ప్రభాస్ ఫైట్ ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారు. నిజానికి ఈ సినిమాలో రానా నటించడం లేదు. కానీ గతంలో ప్రభాస్ , రానా కాంబోలో వచ్చిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను మెప్పించింది. ఇక ఆ సినిమాలో వీళ్ళిద్దరూ బద్ధ శత్రువులుగా జీవించి ప్రేక్షకులను అలరించారు. అయితే “సలార్” సినిమాలో కూడా వీళ్ళిద్దరూ ముందుగా కథ ప్రకారం ప్రాణ స్నేహితులుగా ఉండి, తర్వాత బద్ధ శత్రువులుగా మారితే ఆ తర్వాత వచ్చే పరిణామాలు ఎలా ఉంటాయో అని ఊహించుకుంటున్నారు.

ఇక “సలార్” సినిమాలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రాణ స్నేహితులుగా నటించారు. ఇద్దరు ప్రాణ స్నేహితులు ఆ తర్వాత బద్ధ శత్రువులుగా మారడంతో వచ్చే వార్ నేపథ్యంలోనే “సలార్” రెండవ పార్ట్ “శౌర్యంగా పర్వం” ఉండబోతోంది. దీంతో పృథ్వీరాజ్ మలయాళ హీరో కాబట్టి ఆయన పాత్రలో రానాను చూడడానికి కొంతమంది ఆశపడుతున్నారు. తెలుగు హీరోలు రానా, ప్రభాస్ మరోసారి వెండితెరపై తలపడితే చూడాలని కోరుకుంటున్నారు. కానీ ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా అద్భుతంగా నటించారు.

Check Filmify for Latest movies news in Telugu and updates from all Film Industries. Also, get latest Bollywood news, new film updates, Celebrity latest Photos & Gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు