Adivi Sesh:IMDB జాబితా విడుదల.. ఘనత సాధించిన అడివి శేష్..!

ప్రముఖ యంగ్ హీరో అడివి శేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సొంతం సినిమా ద్వారా ఇండస్ట్రీకి ఒక చిన్న క్యారెక్టర్ లో నటించి..ప్రేక్షకులకు పరిచయమైన ఈయన సినిమాల మీద మక్కువతో అమెరికాలో ఉన్న కుటుంబాన్ని కూడా వదిలి ఇండియాకి వచ్చి తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కర్మ అనే సినిమాను సొంతంగా నిర్మించి కొంతవరకు నష్టపోయాడు కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన పంజా సినిమా మంచి గుర్తింపు తెచ్చి పెట్టడమే కాదు ఏకంగా బాహుబలి సినిమాలో నటించే అవకాశాన్ని కూడా అందించింది.

హీరోగా రైటర్ గా కూడా మారి.. క్షణం సినిమాతో ఇండస్ట్రీ ని షేక్ చేశాడు. ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఈ సినిమా తర్వాత మళ్లీ వెను తిరిగి చూడలేదు. అలా గూఢచారి సినిమాతో టాలీవుడ్ స్టైలిష్ స్పై గా మారిపోయి.. ఆ తర్వాత ఎవరు, హిట్, మేజర్ వంటి వరుస విజయాలను తన ఖాతాలో వేసుకున్నారు. ప్రస్తుతం డెకాయిట్ అనే సినిమాతో పాటు గూడచారి 2 సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న అడివి శేష్ తాజాగా ఒక అరుదైన గౌరవాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.

ప్రఖ్యాత ఐ ఎం డి బి మొదటిసారి తాము రేటింగ్ ఇచ్చిన టాప్ 250 చిత్రాలను ప్రకటించగా.. అందులో అడివి శేష్ మూడు సినిమాలు ఉండడం విశేషం. క్షణం, ఎవరు, మేజర్ లాంటి సినిమాలు ఈ జాబితాలో నిలిచాయి. దీంతో ఈ కుర్ర హీరో పేరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ 250 చిత్రాలలో అడివి శేష్ సినిమాల రేటింగ్ , ర్యాంకింగ్ ఎంత అన్నది తెలియాల్సి ఉంది.

- Advertisement -

ఇక ఈ విషయం తెలిసి అభిమానులు అలాగే సెలబ్రిటీలు అడివి శేష్ కి కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇకపోతే ప్రస్తుతం డెకాయిట్ ,గూడచారి 2 సినిమాలలో నటిస్తున్న అడివి శేష్ ఈ సినిమాలతో ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు