Ram Charan: చెర్రీ విషయంలో ఉపాసన ఇంత పొసెసివా? వీడియో వైరల్

Ram Charan

టాలీవుడ్ క్రేజీ సెలబ్రిటీ కపుల్స్ లో రామ్ చరణ్ ఉపాసన జంట ఒకటి. వీళ్ళిద్దరూ వేర్వేరు రంగాల్లో పని చేస్తున్నప్పటికీ ఒకవైపు పర్సనల్ లైఫ్, మరోవైపు ప్రొఫెషనల్ లైఫ్ ను అద్భుతంగా మేనేజ్ చేస్తూ సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. ఓ పాపకు తల్లయిన తర్వాత కూడా కుటుంబ బాధ్యతలు చూసుకుంటూనే బిజినెస్ వుమన్ గా ఉపాసన దూసుకెళ్తోంది. మరోవైపు రాంచరణ్ గ్లోబల్ స్టార్ గా అదరగొడుతున్నాడు. ఇలా వీళ్ళిద్దరూ తమ బిజీ లైఫ్ లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. అయినప్పటికీ కుటుంబం కోసం ఇద్దరూ ప్రత్యేకంగా సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరూ కలిసే కనిపిస్తూ ఉండటం వల్ల ఉపాసన పొసెసివ్ అనే టాక్ ఫిలిం ఇండస్ట్రీలో ఉంది. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో చూస్తుంటే అదే నిజం అనిపిస్తుంది అంటున్నారు నెటిజన్లు.

తాజాగా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఉపాసనను యాంకర్ ఏ హీరోయిన్ తో రామ్ చరణ్ కెమిస్ట్రీ బాగుంటుంది? అని ప్రశ్నించింది. దానికి ఉపాసన రియాక్ట్ అవుతూ “రామ్ చరణ్ బెస్ట్ కెమిస్ట్రీ అంటే అది నాతోనే” అని సమాధానం ఇచ్చింది. మీరు ఓకే, కానీ ఒక హీరోయిన్ పేరు చెప్పండి? అని యాంకర్ అడగ్గా, “నేను ఆయన భార్యను.. ఆ విషయం మీరే చెప్పాలి” అని ఉపాసన అనడం ఆ వీడియోలో కనిపిస్తోంది. దీంతో యాంకర్ రామ్ చరణ్, కాజల్ కెమిస్ట్రీ బాగుంటుందని చెప్పగానే, ఉపాసన అందుకుని “కాజల్ అనే ఏముంది? అలియా భట్, ప్రియాంక చోప్రా, కియారా, సమంతలతో కూడా రామ్ చరణ్ కెమిస్ట్రీ బాగుంటుంది” అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ విషయం చెప్పేటప్పుడు ఉపాసన ఎక్స్ప్రెషన్స్ చూసినవారు నిజంగానే చెర్రీ విషయంలో ఆమె పొసెసివ్ ఫీల్ అవుతుందని అనిపిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.

ఇక రామ్ చరణ్, ఉపాసనలది ప్రేమ వివాహం కాగా, 2012లో పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి బంధంలోకి అడుగు పెట్టారు. పెళ్లయిన 11 ఏళ్లకు అంటే 2023లో ఉపాసన ఒక పాపకు జన్మనిచ్చారు. ఆ పాపకు క్లింకార అని పేరు పెట్టారు. ఇక ఈ నేపథ్యంలోనే ఉపాసన చెర్రీ తనకు మాత్రమే సొంతమని, సిల్వర్ స్క్రీన్ పై హీరోయిన్లతో ఆయన రొమాన్స్ చేస్తే చూసి తట్టుకోలేదని, నొచ్చుకుంటుందని ప్రచారం జరుగుతుంది. దానికి తగ్గట్టుగానే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో కూడా ఉంది. ఇదిలా ఉండగా రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో “గేమ్ చేంజర్” అనే మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను జూన్ లో పూర్తి చేసి, యంగ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో మరో మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నాడు చెర్రీ.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు