Ambajipeta Marriage Band : అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటిటీలో ఎప్పుడంటే?

Ambajipeta Marriage Band

సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” మోత బాక్సాఫీస్ వద్ద గట్టిగా మోగుతోంది. ఫిబ్రవరి 2న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ మూడు రోజుల్లోనే 8 కోట్ల 60 లక్షల వసూళ్లను రాబట్టింది. మొదటి రోజే ఈ మూవీ రెండు కోట్ల 28 లక్షల కలెక్షన్స్ దక్కించుకుంది. ఈ బ్లాక్ బస్టర్ మూవీ త్వరలోనే ఓటిటిలో రిలీజ్ కాబోతోంది. మరి ఏ ఓటిటి ప్లాట్ ఫామ్ లో ఎప్పుడు రిలీజ్ కాబోతోంది? అంటే…

యంగ్ డైరెక్టర్ దుష్యంత్ కటికనేని “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” మూవీతో డైరెక్టర్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ మూవీలో సుహాస్ హీరోగా, శివాని నాగారం హీరోయిన్ గా నటించింది. కలర్ ఫోటో, రైటర్ పద్మభూషణ్, తాజాగా వచ్చిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీతో సుహాస్ హ్యాట్రిక్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమాలో నిమ్న వర్గానికి చెందిన యువకుడి పాత్రను పోషించిన సుహాస్ నటనకు, పద్మ పాత్రను పోషించిన నటి శరణ్య ప్రదీప్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కుల వివక్షకు లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎమోషన్స్ ను జోడించి డైరెక్టర్ దుష్యంత్ తెరకెక్కించిన ఈ మూవీ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ లో సభ్యుడిగా పని చేస్తున్న మల్లికి కవల సోదరి పద్మ ఉంటుంది. స్కూల్ టీచర్ గా పని చేస్తున్న పద్మ ఊరి పెద్దగా చలామణి అవుతున్న వెంకట్ బాబుతో స్కూల్ విషయంలో గొడవ పడుతుంది. ఆ గొడవ ఆమె జీవితాన్ని ఎలాంటి మలుపు తిప్పింది? ఈ గొడవ వల్ల వెంకట్ బాబు చెల్లెలు లక్ష్మితో ప్రేమాయణం సాగిస్తున్న మల్లి లవ్ స్టోరీ ఏమైంది? అనేదే అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ మూవీ స్టోరీ.

ఫస్ట్ వీక్ లోనే లాభాల్లోకి అడుగు పెట్టిన అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ కాబోతోంది అన్న విషయంపై ఆసక్తిని కనబరుస్తున్నారు నెటిజన్లు. ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను తెలుగు ఓటిటి సంస్థ ఆహా ఫ్యాన్సీ రేటుకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. థియేటర్లలో విడుదలైన నాలుగు నుంచి ఐదు వారాల తర్వాత ఓటీటీ లో “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” ను ఆహాలో స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు సమాచారం. ఈ లెక్క ప్రకారం మార్చ్ ఫస్ట్ వీక్ లో “అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్” ఓటీటీ రిలీజ్ డేట్ పై ఆహా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -

Check out Filmify for the latest Tollywood news in Telugu, and all the Entertainment News, current news in Bollywood and Celebrity News & Gossip, from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు