vijay Devarakonda : రష్మిక బోల్డ్ పర్ఫార్మెన్స్ పై విజయ్ దేవరకొండ ఏమన్నారంటే..?

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను నమోదు చేస్తోంది. ఈ చిత్రం డిసెంబర్ 1న థియేటర్స్ లో రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ టాక్ ని అందుకుంది. 200 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం 210 కోట్ల షేర్ బాక్స్ ఆఫీస్ టార్గెట్ తో జర్నీని ప్రారంభించింది. ఆ రేంజ్ లోనే వసూళ్ల పర్వంతో దూసుకెళ్తోంది.

ఈ చిత్రంలో రణబీర్ నటనని స్టార్ దర్శకులు, నటులు కూడా ప్రశంసిస్తున్నారు. అలాగే ఈ సినిమాలో హీరోయిన్ తో పాటు మంచి పేరు తెచ్చుకున్న యాక్టర్స్ అనిల్ కపూర్, బాబి డియోల్ ఈ సినిమాలో చాలా ముఖ్యమైన పాత్రలు పోషించారు. ముఖ్యంగా రష్మిక మందన్న బోల్డ్ పర్ఫార్మెన్స్ పై షాక్ అయిపోతున్నారు. ఈ సమయంలోనే విజయ్ దేవరకొండ యానిమల్ సినిమాలో రష్మిక బోల్డ్ పెర్ఫార్మెన్స్ పై చాలా పాజిటివ్ గా స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగ – విజయ్ దేవరకొండ మంచి స్నేహితులన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండనే ఆమెను హీరోయిన్ గా సజెస్ట్ చేశారంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇందుకు తగ్గట్టుగానే ఈ సినిమాలో రష్మిక బాగా నటించిందని.. సినిమా సక్సెస్ కి రష్మిక నటన కూడా కారణమైందంటూ ఓ రేంజ్ లో పొగిడేసారట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే ఈ చిత్రంలో రష్మిక నటనపై విజయ్ దేవరకొండ అభిమానులు మాత్రం అసహనం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

Check Filmify for the Latest movie news in Telugu and updates from all Film Industries. Also, get the latest Bollywood news, new film updates, Celebrity latest Photos and gossip news at Filmify Telugu.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు