Extra Ordinary Man : నితిన్ పై అంత నమ్మకమా? రిస్క్ అవసరమా దిల్ రాజు ?

యంగ్ హీరో నితిన్ “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” అంటూ డిసెంబర్ 8న థియేటర్లలో సందడి చేయడానికి రెడీగా ఉన్నాడు. వక్కంతం వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండవ మూవీ ఇదే కాగా, ఈ మూవీలో మోస్ట్ వాంటెడ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా కనిపించబోతోంది. ఎండ్ టు అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న ఈ మూవీకి సంబంధించిన ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్స్ సినిమాపై కాస్త ఆసక్తిని పెంచేసింది. ఇక సినిమా రిలీజ్ దగ్గర పడుతుండడంతో మూవీ రైట్స్ కు సంబంధించిన థియేట్రికల్, డిజిటల్ డీల్స్ ను క్లోజ్ చేసే పనిలో పడ్డారు మేకర్స్.

ఈ నేపథ్యంలో టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ మూవీ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకు సొంతం చేసుకున్నాడని సమాచారం. “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీ నైజాం హక్కులను ఏకంగా 15 నుంచి 20 కోట్ల భారీ రేటుకు దిల్ రాజు కొనుగోలు చేశారనే టాక్ ఫిలింనగర్ వర్గాల్లో నడుస్తోంది. ఒకవేళ అదే గనక నిజమైతే దిల్ రాజుకు ఇది పెద్ద రిస్క్ అని చెప్పాలి. అసలు చాలా కాలంగా ఫామ్ లో లేని నితిన్ సినిమాను ఇంత ఫ్యాన్సీ రేట్ పెట్టి కొనుక్కోవడం తప్పకుండా రిస్క్ అవుతుంది.

‘భీష్మ’ సినిమా తర్వాత నితిన్ కెరీర్ లో హిట్ అనే మాటే కరువైంది. అంతేకాకుండా ఫస్ట్ మూవీతోనే ప్లాఫ్ అందుకున్న డైరెక్టర్ వక్కంతం వంశీ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇది చాలదన్నట్టుగా టాలీవుడ్ లో ఒక్క బ్లాక్ బస్టర్ మ్యూజికల్ హిట్ కూడా ఇవ్వలేకపోయినా మ్యూజిక్ డైరెక్టర్ హ్యారీస్ జయరాజ్ ఈ మూవీకి సంగీతం అందిస్తున్నారు. ఇక శ్రీలీల కూడా గత రెండు సినిమాలతో డిజాస్టర్లు అందుకుంది. ఈ సెంటిమెంట్స్ అన్నీ సరిపోవు అన్నట్టుగా నితిన్ సినిమాకు అసలు బజ్ లేనేలేదు. నితిన్ ఒక్కడే సినిమా ప్రమోషన్ బాధ్యతలు తన భుజాన మోస్తున్నాడు. వరుసగా ఇంటర్వ్యూలు ప్లాన్ చేస్తున్నాడు. కానీ హీరోయిన్ శ్రీలీల మాత్రం ఎక్కడా కనిపించడం లేదు.

- Advertisement -

సినిమా కనీసం యావరేజ్ గా నిలవాలన్నా ఇవన్నీ ఏమాత్రం సరిపోవు. ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకునేలా “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” టీం ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. మరి మూవీ థియేటర్లలోకి రావడానికి ఇంకా కేవలం నాలుగు రోజులే మిగిలి ఉంది. ఈ నాలుగు రోజుల్లో నితిన్ టీం ఏదన్నా మ్యాజిక్ చేస్తే తప్ప అతను సేఫ్ అయ్యే అవకాశం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో దిల్ రాజు “ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్” మూవీని అంత భారీ రేటుకు కొనుగోలు చేయడం సాహసం అనే చెప్పాలి. సినిమాకు ఏమాత్రం నెగెటివ్ టాక్ వచ్చినా డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు తప్పవు. మరి దిల్ రాజుకు నితిన్ పై అంత నమ్మకం ఏంటో.? మరోవైపు దిల్ రాజు అంచనాలు దాదాపుగా తప్పవు అనే టాక్ ఉంది. మరి నితిన్ దిల్ రాజు నమ్మకాన్ని నిలబెడతాడా ? అనేది తెలియాలంటే డిసెంబర్ 8 వరకు వెయిట్ చేయాల్సిందే.

Check out Filmify for the latest Movie updates, New Movie Reviews, Ratings, and all the Entertainment News in Tollywood & Bollywood and all other Film Industries.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు