Meera Jasmine: ఆ తప్పే కెరీర్ను నాశనం చేసింది – మీరా జాస్మిన్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న హీరోయిన్ మీరాజాస్మిన్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. మొదట నటుడు హీరో మాధవన్ తో కలిసి రన్ అనే సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యింది. ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. కానీ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన భద్ర సినిమాలో రవితేజకు జోడిగా నటించి తన నటనతో అందంతో ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంది ఈ మలయాళం ముద్దుగుమ్మ మీరాజాస్మిన్..ఈ సినిమా తో ఈమె క్రేజ్ అమాంతం పెరిగిపోయింది.

అలా మీరాజాస్మిన్ అతి తక్కువ సమయంలోనే తమిళ్ ,తెలుగు , మలయాళం , కన్నడ తదితర భాషలలో కూడా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ హీరోయిన్గా మారిపోయింది. ముఖ్యంగా తెలుగు లో వచ్చిన గోరింటాకు, పందెంకోడి, తదితర చిత్రాలు ఈమె కెరియర్ ని మార్చేశాయి. అయితే అనుకోకుండా మీరాజాస్మిన్ తన జీవితంలో తీసుకున్న ఒక నిర్ణయం వల్ల ఈమె సినిమా కెరియరే నాశనం అయ్యిందట. అదేంటంటే ..2014వ సంవత్సరంలో అనిల్ జాన్ టైటస్ అనే డైరెక్టర్ ని ప్రేమించి మరి వివాహం చేసుకుంది.

పెళ్లయిన కొత్తలో వీరిద్దరూ చాలా అన్యోన్యంగా ఉండేవారు. కానీ కొన్ని కారణాల చేత వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో వివాహమైన రెండు సంవత్సరాలకే మీరాజాస్మిన్ కోర్టులో విడాకులకు అప్లై చేయడం జరిగిందట. దీంతో ఒక్కసారిగా ఈ విషయం కోలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆ తర్వాత అధిక బరువు పెరగడంతో మీరాజాస్మిన్ కు అవకాశాలు తగ్గిపోయాయి. అలా 2018 వ సంవత్సరంలో కోర్టు నుండి విడాకులు తీసుకొని తన భర్త నుంచి దూరంగా వెళ్లిపోయింది మీరాజాస్మిన్ .

- Advertisement -

ప్రస్తుతం కుటుంబ సభ్యులతో తిరువనంతపురంలో ఉన్నట్లు సమాచారం. మీరా జాస్మిన్ అన్ని భాషలలో కలుపుకొని దాదాపుగా 50కి పైగా చిత్రాలలో హీరోయిన్ గా నటించింది. 20 కి పైగా సినిమాలకు అవార్డులను కూడా అందుకుంది. అచ్చ తెలుగు అమ్మాయిగా కుందనపు బొమ్మలా కనిపించే మీరాజాస్మిన్ కెరియర్ ముగిసిపోవడానికి ఈమె పెళ్లే కారణమని అభిమానులు సైతం తెలియజేస్తూ ఉన్నారు. చివరిగా 2018 లో ఒక మలయాళం సినిమాలో నటించింది.అయితే ఈ మధ్యనే తిరిగి సెకండ్ ఇన్నింగ్స్ ని సైతం మొదలుపెట్టింది మీరాజాస్మిన్.. సోషల్ మీడియాలో తరచూ గ్లామర్ వలకబోస్తూ పలు సినిమాలలో అవకాశాలను అందుకుంటూ తన సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా బిజీగా గడిపేస్తోంది. అయితే గతంలో కూడా మీరా జాస్మిన్ పైన పలు రకాల రూమర్స్ వినిపిస్తూనే ఉండేవి. మరి సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మరి.

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు