Supreeta Naidu : ఇంత త్వరగా ప్లేట్ మార్చేసావ్ ఏంటి నాయుడు.?

తెలంగాణ రాష్ట్రంలో రీసెంట్గా ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. సినిమా ఫిల్మ్ ఇండస్ట్రీకి, రాజకీయాలకి ఒక విడదీయలేని ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది అని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలానే తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీస్ టిఆర్ఎస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ వచ్చారు.

కేవలం ఒక్క బండ్ల గణేష్ మినహాయిస్తే మిగతా వాళ్ళంతా కూడా టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎన్నుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ తరుణంలో చాలామంది సినీ ప్రముఖులు యాడ్స్ లో కూడా నటించారు. సినీ పరిశ్రమకు చెందిన కొందరు నటులు, నటీమణులు కూడా తెలంగాణ ప్రభుత్వానికి సపోర్టుగా కొన్ని బైట్స్ ని, రీల్స్ ని షేర్ చేస్తూ వచ్చారు. ఇకపోతే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు సురేఖ వాణి.

సురేఖ వాణి కూతురు సుప్రీతా నాయుడు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సినిమాల్లో ఆఫీసియల్ ఎంట్రీ ఇవ్వకపోయినా సోషల్ మీడియాలో రీల్స్ తో హాట్ హాట్ పిక్స్ తో ఎప్పటికప్పుడు కుర్రకారుని పిచ్చెక్కిస్తుంది ఈ అమ్మాయి. అయితే రీసెంట్ గా ఈమె టిఆర్ఎస్ పార్టీకి క్యాంపైనికి సంబంధించి ఒక రీల్ ని తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. అయితే రీసెంట్ గా తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన రిజల్ట్స్ తారుమారయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికారం పట్టంకట్టారు.
దీంతో ఆమె క్యాంపెయిన్ చేసిన రీల్ ను ఇంస్టాగ్రామ్ నుంచి రిమూవ్ చేసి, ప్రస్తుతం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన రేవంత్ రెడ్డితో దిగిన ఫోటోను ఇంస్టాగ్రామ్ స్టోరీలు షేర్ చేసింది.

- Advertisement -

కేవలం సక్సెస్ మాత్రమే ప్రాధాన్యతనిస్తూ, బిఆర్ఎస్ ఓడిపోవడంతో రీల్ రీమోవ్ చేయడం వలన ఈమె పై ట్రోల్స్ మొదలు అయ్యాయి. రేవంత్ రెడ్డితో ఫోటో పెట్టడం పర్వాలేదు కానీ, రీల్ రీమూవ్ చెయ్యడం కన్నింగ్ మైండ్సెట్ అనిపిస్తుంది. ఈమె మళ్ళీ ఇంస్టాగ్రామ్ స్టోరీలో క్లారిటీ ఇచ్చిన కూడా ట్రోల్ల్స్ తగ్గట్లేదు.

check Filmify for the most recent movies news and updates from all Film Industries. Also get latest tollywood news, new film updates, Bollywood Celebrity News & Gossip at filmify

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు