Animal Movie: జక్కన్న జంగుతున్నాడా… మరి ఎందుకీ సైలెంట్?

యానిమల్ సినిమా రిలీజ్ అయి మూడు రోజులు అవుతుంది. ఇప్పటి వరకు ఈ మూవీ వరల్డ్ వైడ్ బాక్సాఫీస్ వద్ద 356 కోట్లను వసూళ్లు చేసి… సంచలనాలను క్రియేట్ చేస్తోంది. అయితే ఈ విజయంపై సెలబ్రెటీలు స్పందించడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. సినిమాలో అడల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండటం, చాలా సందర్భాల్లో సినిమాలోని లీడ్ రోల్స్ నుంచి బూతు పురాణాలు వినిపించడం వల్ల యానిమల్ విక్టరీ గురించి స్పందించడం లేదా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో టాక్.

రీసెంట్ గా హీరోయిన్ త్రిష స్పందించింది. తన ఇన్ స్టాలో యానిమల్ మూవీ కల్ట్ అంటూ చెప్పి అభినందించింది. కానీ, వెంటనే దాన్ని డిలీట్ చేసింది. అయితే అందరి కళ్లు… మహేష్ బాబు, రాజమౌళి సోషల్ మీడియా అకౌంట్స్ పై ఉన్నాయి. ఈ ఇద్దరే ఎందుకంటే.. యానిమల్ తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ ఇద్దరే చీఫ్ గెస్ట్‌లు. అందుకే వీళ్లు యానిమల్ సినిమాపై ఎలా స్పందిస్తారో అని ఆడియన్స్ కళ్లు కాయలు కాసేలా సోషల్ మీడియా అకౌంట్స్ ని చూస్తున్నారు.

సినిమా వచ్చి మూడు రోజులు అవుతుంది. మూడు వందలపైగా కలెక్షన్లు వసూళ్లు చేసి 500 కోట్లను కలెక్ట్ చేసే దిశగా దూసుకెళ్తుంది. కానీ, ఇద్దరిలో ఎవరూ కూడా స్పందించడం లేదు. మహేష్… సినిమా బిజీలో ఉన్నాడు. పైగా ఆయన పెద్దగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడు. కానీ, రాజమౌళికి ప్రస్తుతానికి పెద్ద పనేమీ లేదు. పైగా చిన్న సినిమాలను కూడా తన మాటలతో ఎంకరైజ్ చేస్తాడు. మరి తాను చీఫ్ గెస్ట్ గా ఉన్న మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంటే… ఎందుకు సైలెంట్ గా ఉన్నాడు.

- Advertisement -

పైగా యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో… డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగాను ఆకాశానికి ఎత్తేశాడు. ఏకంగా రామ్ గోపాల్ వర్మతోనే పోల్చి… తన కంటే గొప్ప దర్శకుడు సందీప్ అంటూ కామెంట్స్ చేశాడు. ఇంతలా హైప్ ఇచ్చిన రాజమౌళి ఇప్పటి వరకు యానిమల్ మూవీ చూడలేదా? ఒక వేళ చూసినా… అందులో ఉన్న అడల్ట్ కంటెంట్ జక్కన్నకు నచ్చలేదా? ఇలాంటి సినిమాలను తాను ఎలా ప్రమోట్ చేయాలని ఆలోచిస్తున్నాడా? అంటూ ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. కొద్ది రోజుల్లోనే యానిమల్ మూవీ సక్సెస్ మీట్ కూడా రాబోతుంది. అప్పటిలోపు అయినా, మహేష్, జక్కన యానిమల్ పై స్పందిస్తారా?

Check out Filmify for the latest Tollywood Movie updates, Movie Reviews, Ratings, and all the Entertainment News Updates in Bollywood and Celebrity News & Gossip from all Film Industires.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు