Hi Nanna : ‘బేబీ’ని కూడా వదలని నాని … గెట్ రెడీ ఫర్ సర్ప్రైజ్

నేచురల్ స్టార్ నాని “హాయ్ నాన్న” మూవీతో మరో మూడు రోజుల్లో ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ఎమోషనల్ అండ్ రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ మూవీలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. తండ్రి కూతుర్ల అనుబంధం నేపథ్యంలో రూపొందుతున్న “హాయ్ నాన్న” మూవీలో బేబీ కియారా ఖన్నా నాని కూతురుగా కనిపించబోతోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు కూడా పూర్తయ్యాయి. అయితే సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినప్పటికీ యూత్ ను ఆకట్టుకునే రొమాంటిక్ సన్నివేశాలు కూడా కావాల్సినంత ఉన్నాయని టాక్ నడుస్తోంది.

మృణాల్ తో సిల్వర్ స్క్రీన్ పై నాని రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని, కుర్రాళ్లలో హీట్ పెంచడం ఖాయమని అంటున్నారు. ఇక నాని సినిమాలో కొన్ని బూతు పదాలు కూడా ఉన్నాయట. అయితే వాటిని సెన్సార్ బోర్డు మ్యూట్ చేయమని కోరిందట. అలాగే ఈ మూవీలో ఉన్న ఎమోషనల్ సన్నివేశాలు ఫ్యామిలీ ఆడియన్స్ ను కట్టి పడేస్తాయని చెబుతున్నారు. ఇలా మొత్తానికి ఒకవైపు ఫ్యామిలీ ఆడియన్స్ ని, మరోవైపు యూత్ ని ఆకట్టుకునేలా మంచి కథను ఎంచుకున్నాడు నాని. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై ఆసక్తిని పెంచేయగా ఎప్పుడెప్పుడు మూవీ థియేటర్లలోకి వస్తుందా అని టాలీవుడ్ ఆడియన్స్ అంతా చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా “హాయ్ నాన్న” మూవీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది.

రీసెంట్ గా చిన్న సినిమాగా రిలీజ్ అయి టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన “బేబీ” మూవీ క్రేజ్ ను కూడా నాని తన సినిమాలో వాడుకోబోతున్నాడు. తాజా సమాచారం ప్రకారం “హాయ్ నాన్న” సినిమాలో ‘బేబీ’ హీరోల్లో ఒకరైన విరాజ్ అశ్విన్ స్పెషల్ రోల్ లో కనిపించబోతున్నాడు అని తెలుస్తోంది. అది ప్రేక్షకులకు సర్ప్రైజింగ్ గా ఉంటుంది అనే టాక్ నడుస్తోంది. దీంతో విరాజ్ అసలు ఎలాంటి రోల్ లో కనిపించబోతున్నాడు అనేది ఆసక్తికరంగా మారింది. మరి విరాజ్ ఈ మూవీలో ఎలాంటి పాత్రను పోషించబోతున్నాడు అనేది తెలియాలంటే సినిమా రిలీజ్ అయ్యేదాకా వెయిట్ చేయక తప్పదు. దీంతో నాని ‘బేబీ’ని కూడా వదలట్లేదా అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు నెటిజెన్లు. ఇక ఇటీవల ‘హాయ్ నాన్న’ మూవీ ప్రమోషన్స్ సందర్భంగా అనూహ్యంగా విజయ్ దేవరకొండ, రష్మిక గోవా వెకేషన్ కు సంబంధించిన ఫోటోలు వాడడంతో నాని వివాదంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. అయితే అలా జరిగినందుకు ఈ ఇద్దరు సెలబ్రిటీలు హర్ట్ అయితే గనక తన తరఫున క్షమాపణలు చెప్తానంటూ నాని ఇప్పటికే వెల్లడించాడు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు