Omkar: ఓంకార్ కూడా మామూలోడు కాదుగా..ఏకంగా ఆ స్టార్ హీరోయిన్ ని.?

బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ఓంకార్. తెలుగులో ఎన్నో రియాల్టీ షోలను నిర్వహించిన ఈయన అప్పట్లో ఆట అనే పేరుతో డాన్స్ రియాల్టీ షోని ప్రారంభించి.. సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆట షో ఏకంగా మూడు సీజన్లను జరుపుకోవడం గమనార్హం. ఆ తర్వాత డైరెక్టర్ గా రెండు మూడు సినిమాలు కూడా చేసిన ఈయన ప్రస్తుతం సెవెన్త్ సెన్స్ అనే ఒక టీవీ షో కి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే ఓంకార్ ను చాలామంది అన్నయ్య అంటూ పిలుస్తూ ఉంటారు.ముఖ్యంగా ఆయన షోకి వచ్చేవాళ్ళు ప్రేమగా అన్నయ్య అని పిలుస్తారు అని అందరికీ తెలిసిందే.

అంతే కాదు అప్పుడప్పుడు ఆయనపై ట్రోల్స్ కూడా వస్తుంటాయి కానీ ఆయన అవేవి పట్టించుకోరు.. తన పని తాను చేసుకుంటూ పోతారు. ఇలాంటి ఓంకార్ ఒక హీరోయిన్ తో లవ్ ఎఫైర్ నడిపించాడని, పెళ్లి చేసుకుంటానని చెప్పి చివరికి మోసం చేశాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం. ఇక ఆ తెలుగు స్టార్ హీరోయిన్ ఎవరో కాదు అందాల తార అంజలి… ఎన్నో చిత్రాలలో హీరోయిన్గా నటించి అభిమానులను దక్కించుకున్న ఈమెకు ఓంకార్ తో లవ్ ఎఫైర్ ఉందనే రూమర్ అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. అయితే వీరిద్దరూ కూడా ఎక్కడా కలసి కనిపించిన దాఖలాలు లేవు. కానీ వీరిద్దరి మధ్య ఎఫైర్ ఉందనే వార్తలు సృష్టించడం నిజంగా ఆశ్చర్యకరమని చెప్పాలి.

అయితే ఈ వార్తలపై గతంలో స్పందించిన అంజలి నిజంగా తనకు ఓంకార్ ఎవరో తెలియదని.. తాను ఎప్పుడూ కలవలేదని.. అసలు ఈ వార్తలు ఎక్కడినుండి పుట్టుకొచ్చాయో కూడా అర్థం కావట్లేదు అని ఆమె తెలిపింది. ఇకపోతే రాజు గారి గది సీక్వెల్ తన దగ్గరకు వచ్చిందని అయితే ఆ సినిమా చేయడానికి తాను ఒప్పుకోలేదంటూ అంజలి చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. ఇక దీంతో అంజలితో ఓంకార్ లవ్ ఎఫైర్ అంటూ వచ్చిన వార్తలకు పుల్ స్టాప్ పడింది. అయితే తన సినిమా రిజెక్ట్ చేయడం వల్లే ఇద్దరి మధ్య ఇలాంటి రూమర్స్ సృష్టించారనే వార్తలు మరింత వైరల్ అయ్యాయి. ఇకపోతే ప్రస్తుతం సెవెన్త్ సెన్స్ షో కి హోస్ట్గా వ్యవహరిస్తున్న ఓంకార్ అందులో సెలబ్రిటీలను ఒకవైపు తన కామెడీ టైమింగ్ తో అలరిస్తూనే.. మరొకవైపు వారిలో టెన్షన్ పుట్టిస్తూ ఆడియన్స్ ను కూడా తెగ ఆకట్టుకుంటున్నారని చెప్పవచ్చు.

- Advertisement -

For More Updates : Checkout Filmify for the latest Movie updates, Movie Reviews & Ratings, and all the Entertainment News

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌ధాన వార్త‌లు